మళ్ళీ పవన్ పాట ఎత్తుకున్నాడు

Update: 2017-12-20 03:48 GMT

గతంలో దిల్ రాజు.. నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరో గా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దిల్ రాజు తో సినిమా ఏం లేదని కొట్టిపారేశాడు.ప్రస్తుతం దిల్ రాజుకి ఎనలేని విజయాలు అందుకుంటూ మాంచి ఊపుమీదున్నాడు. నిర్మాతగా ఎన్నో సాధించినా ప్రతిసినిమాని తన తొలి సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ గానే సినిమాల్ని తెరకేక్కిస్తాడనే పేరు దిల్ రాజు సొంతం. ఇకపోతే దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన తాజా సినిమా 'ఎం.సి.ఎ'.

నాని - సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 21 న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజు ఎక్కడలేని విషయాలను మీడియాతో పంచుకుంటున్నాడు. అలాగే కొత్త కొత్త విషయాలు దిల్ రాజు నుండి బయటికి వస్తున్నాయి. అందులో భాగంగానే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ... ఈ మధ్యే తాను పవన్ కళ్యాణ్‌ను కలిశానని..... మీతో కలిసి సినిమా తియ్యడం నా కోరిక అని పవన్ కళ్యాణ్ గారితో చెప్పాను అని పాత మాటే చెబుతున్నాడు.

అయితే తనతో సినిమా చేసే విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక హామీ ఇచ్చాడని రాజు వెల్లడించాడు. మంచి స్క్రిప్టుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తన దగ్గరికి రావచ్చని. తన రాజకీయాలు, తన కమిట్మెంట్లు అవన్నీ సంబంధం లేకుండా తాను సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ తనకి మాటిచ్చినట్టు దిల్ రాజు చెబుతున్నాడు. సరైన సమయం వచ్చి మంచి సబ్జెక్ట్ దొరికితే పవన్‌ కళ్యాణ్ తో తప్పకుండా సినిమా చేస్తానని దిల్ రాజు అన్నాడు. అయితే ఇదే విషయం పవన్ తో దిల్ రాజు సినిమా అన్నప్పుడే ప్రచారం జోరుగా జరుగగా.. ఇప్పుడు దిల్ రాజు ఏదో కొత్త విషయాన్ని చెప్పినట్టుగా చెప్పడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Similar News