తెలుగులో పరిచయం అయ్యి ఇక్కడ సక్సెస్ లేక డైరెక్టుగా బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ నుండి టాలీవుడ్ పై విమర్శలు చేయటం స్టార్ట్ చేసింది తాప్సి. ఎక్కువగా ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి తాను ఏంటో నిరూపించుకుంటుంది. తెలుగు ఇండస్ట్రీ మీద ఇప్పటికే పలుమార్లు సెటైర్లు వేసింది. అయితే ఇప్పుడు ఎవరినైనా విమర్శించడానికి వెనుకాడట్లేదు.
తాజాగా ఆమె కన్ను దేశంలో అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లోనూ ఆధిపత్యం చలాయిస్తున్న వారసుల మీద పడింది. లేటెస్ట్ ఓ ఇంగ్లీష్ డైలీ పేపర్ కి ఇచ్చినా ఇంటర్వ్యూ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ.. ‘‘మనకంటూ కొన్ని ఆలోచనలుంటాయి. మనం ఏదో మాట్లాడదాం అనుకుని ప్రిపేరై ఒక ఈవెంటుకి వెళ్తాం. కానీ అక్కడ మనల్ని ఎప్పుడూ ఏమీ సాధించని స్టార్ కిడ్స్ కమ్మేస్తారు. మా లాంటి వాళ్లు జీవితంలో ఎన్నో కష్టాలు పడి. కేవలం టాలెంట్‌తోనే ఈ స్థాయికి వచ్చాం. కానీ ఒక స్టార్ కొడుకు లేదా కూతురు అనే పేరుతో వచ్చి వాళ్లు మొత్తం పేరు కొట్టేస్తుంటారు’’ అని అంది.
తాప్సి మొదటి సినిమా ‘ఝుమ్మంది నాదం’తో మొదలుపెడితే.. చివరగా చేసిన ‘జుడ్వా-2’ వరకు ఆమె దాదాపుగా అన్ని స్టార్ కొడుకులతోనే చేసింది. మరి ఆమె కామెంట్లు వాళ్లందరికీ తగులుతాయి.