తమన్నా, సమంత ల హవా తెలుగులో తగ్గుతున్న తరుణంలో కేరళ నుంచి దిగుమతి ఐన భామలు అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, నివేధ థామస్ లు తెలుగు లో కుర్ర కథానాయకుల దగ్గర నుంచి అగ్ర కథానాయకుల చిత్రాల వరకు అన్నింటా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరాది భామల పై మన వారికి ఎప్పుడూ వుండే మోజు మరుగున పడకుండా ఆ లోటుని తీరుస్తూ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై ఆ చిత్రంతోనే బాగా చేరువైపోయింది అందాల భామ మెహ్రీన్ పిర్జాధ.
గత ఏడాది మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో అలరించిన మెహ్రీన్ కి మెగా అభిమానులకి చేరువయ్యే సదావకాశం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ చిత్రంలో కథానాయిక గా వచ్చింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటంతో మెహ్రీన్ కి అనుకున్న గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు మరొక సారి అలాంటి సదావకాశమే మెహ్రీన్ తలుపు తట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 లో వరుణ్ తేజ్ సరసన కథానాయికగా నటించే అవకాశం కోసం మెహ్రీన్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఫిదా తో డబల్ బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తొలి ప్రేమ, ఎఫ్ 2 వంటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. మరి మెహ్రీన్ ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో వేచి చూడాలి.