టాలీవుడ్ లో ప్రస్తుతం 'భరత్ అనే నేను' సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ వరసగా రెండు సినిమాలు ప్లాప్ అయ్యిన ఈ సినిమాపై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు. మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా రెండో సినిమా కాబట్టి కలెక్షన్స్ కూడా 'శ్రీమంతుడు' సినిమాకి మించే ఉంటాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.
'భరత్ అనే నేను' సినిమా విడుదల దగ్గర పడేకొద్దీ ఏదోకటి రికార్డు సృష్టిస్తూనే వుంది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ లో నిర్మాత కి 70 - 80% వచ్చాయని తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ వారు ఓ పెద్ద అమౌంట్ కి కొనుక్కున్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్ గా శాటిలైట్ హక్కుల ధర రికార్డ్ సృష్టించింది.
ఇప్పటివరకు మహేష్ సినిమాల్లో ఏ సినిమాకి రానంతగా అన్ని బాషలలో కలిపి స్టార్ మా రూ.39 కోట్లకు దక్కించుకుంది. అలానే డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సినిమా బడ్జెట్ లో దాదాపు 75% రికవర్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.