ప్రముఖ దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను తెరకెక్కించిన చిత్రాలలో హీరోల పాత్రల పేర్లు రెండు పేర్ల కలయికగా ఉండేలా, అవి వినూత్నంగా ఉండేలా శ్రద్ద వహిస్తారు. తొలి నుంచి ఆయన చిత్రాలలో హీరో క్యారెక్టర్ నేమ్స్ ఇందుకు ఉదాహరణ. నంద గోపాల్, పార్థ సారధి, సంజయ్ సాహు, అల్లూరి సీత రామరాజు, రవీంద్ర నారాయణ్, గౌతమ్ నంద, విరాజ్ ఆనంద్, ఆనంద్ విహారి వంటి పేర్లతో ఆకట్టుకునే త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తాను దర్శకత్వం వహించనప్పటికీ స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన తీన్మార్ చిత్రంలో కూడా రెండు వైవిధ్యమైన క్యారెక్టర్ నేమ్స్ అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధ లతో ఆకట్టుకున్నారు.
త్రివిక్రమ్జ-కళ్యాణ్ కాంబినేషన్ లో జల్సా, తీన్మార్, అత్తారింటికి దారేది అనంతరం వస్తున్న చిత్రం కావటంతో అజ్ఞ్యాతవాసి చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ ఏమి ఉంటుందా అనే ఆసక్తి అభిమానులలో పెరిగిపోతుంది. చిత్రం ఆల్బం లోని పాటల లిరిక్స్ లో హింట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఐడియా ని ఎవరు క్యాచ్ చేసినట్టుగా కనిపించకపోవటంతో చిత్ర బృందమే ఇప్పుడు క్యారెక్టర్ నేమ్ పై ఒక అనధికారిక లీక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర పేరు 'అభిషిఖ్త్ భార్గవ' అని వినికిడి. వినూత్నంగా వున్న ఈ పేరు నిజంగా పవర్ స్టార్ క్యారెక్టర్ పేరా కాదా అనేది తెలియాలంటే వచ్చే బుధవారం వరకు ఆగాల్సిందే.