మరో మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్న డైరెక్టర్

Update: 2017-11-21 13:00 GMT

ప్రసుత్తం టాలీవుడ్ లో ఏ నోటా విన్నా ఒకటే మాట అదే నందమూరి తారక రామారావు - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా గురించే. ఎందుకంటే రాజమౌళి ఈ ఇద్దరి హీరోస్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే ఈ టాపిక్ వైరల్అయింది. అయితే దీనిపై రాజమౌళి ఏమి నోరు విప్పకపోయినా ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నారు.

అయితే మరోవైపు టాలీవుడ్ లో ఇంకో మల్టీ స్టారర్ సినిమా రాబోతుంది. నితిన్ - శర్వానంద్ కాంబినేషన్ లో ఓ సినిమా తీసేందుకు డైరెక్టర్ హరీష్ శంకర్ రెడీ అవుతున్నాడట. తాజాగా హరీష్ ఈ హీరోలిద్దరినీ కలిసి సబ్జెక్ట్ లైన్ వినిపించాడని.. వాళ్లిద్దరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నారు.

స్క్రిప్ట్ నచ్చితే మల్టీ స్టారర్ చేసేందుకు రెడీ అని నితిన్ - శర్వా చెప్పడంతో ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్ది స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు హరీష్ శంకర్. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.

Similar News