మరో బంపర్ ఆఫర్ తగిలింది

Update: 2018-03-08 10:48 GMT

శ్రీను వైట్ల చాలా కాలం సక్సెస్ లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. వరస ప్లాప్స్ తో నెగటివ్ ఇంప్రెషన్ తెచ్చుకుంటున్నాడు. అయితే శ్రీను వైట్ల ఇప్పుడు మాస్ మహా రాజా రవితేజ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నీ కోసం సినిమా తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ మన ముందుకు రానుంది.

రవితేజ - శ్రీను వైట్ల సినిమాకు 'అమర్ అక్బర్ ఆంటోని' టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఈ రోజున ప్రారంభం అయ్యాయి. రవి తేజ పక్కన అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఇప్పటికే అను 'నాపేరు సూర్య' .. 'శైలజా రెడ్డి అల్లుడు' వంటి మంచి ప్రాజెక్టులు చేస్తుంది. ఈ సినిమా కూడా ఆమెకు మరింత ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ సినిమాతో మళ్లీ కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు సునీల్. రవి తేజకు..శ్రీను వైట్లకు ఈ సినిమా కీలం కానుంది. ఇద్దరు వరస ప్లాప్ తో సతమతం అవుతున్నారు. ఈ సినిమాతో ఐన వీరిద్దరూ బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. తమన్ సంగీతాన్ని అందించనున్నాడు.

Similar News