అక్కినేని నాగ చైతన్య, వెంకటేష్ కి మేనల్లుడు. నాగ చైతన్య అంటే ఇష్టం ఉండటం వల్లే వెంకటేష్, నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ప్రేమం' సినిమాలో క్యామియో రోల్ లో నటించాడు. ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ వంటి కార్యక్రమాల్లో వెంకీ ఫ్యామిలీతో సహా హాజరవడమే కాదు చైతు పెళ్ళికి కూడా గోవా కి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే 'ప్రేమమ్' సినిమాలో మామ అల్లుళ్ళు గా ఆడియన్స్ ని అలరించిన వీళ్ళు మరొకసారి కలిసి నటించబోతున్నారనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ సారి ఈమామ అల్లుళ్ళు ఫుల్ లెంగ్త్ మూవీ లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని చెబుతున్నారు.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాలో లో నాగ చైతన్య , వెంకటేష్ లు కలిసి నటించబోతున్నారట. ఇక ఈ మల్టీ స్టారర్ మూవీ లో నటించడానికి ఇప్పటికే వెంకి, చైతు కూడా ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి కి రచయిత కోన వెంకట్ కథ, మాటలు అందిస్తున్నారు. ఇక వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించడమే విశేషమైతే.... ఒకవేళ అన్ని అనుకున్నట్టు సెట్ అయితే నాగార్జున కూడా ఈ మూవీ లో ఒక గెస్ట్ రోల్ లో నటించొచ్చనే సమాచారం అందుతుంది. ఇప్పటి వరకూ కుటుంబ కథా చిత్రాలకు దగ్గరగా ఉండే కథలనే ఎన్నుకుంటున్న కళ్యాణ్ కృష్ణ..... ఈ సినిమాలో లో కూడా అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అని అంటున్నాడు.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లుగా చెబుతున్నారు.