మరొక్కసారి పొగడ్తలతో చంపేసింది

Update: 2017-12-18 18:05 GMT

ప్రస్తుతం ఎక్కడ చూసినా అజ్ఞాతవాసి మేనియానే నడుస్తోంది. నాని మిడిల్ క్లాస్ అబ్బాయి, అఖిల్ హలో సినిమాలు ఈ వారమే విడుదలవుతున్నప్పటికీ.. ఎక్కువ శాతం ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మీద చర్చించుకుంటున్నారు అంటేనే.. ఆ సినిమాపై జనాల్లో ఏ విధమైన ఆసక్తి ఉందొ అర్ధమవుతుంది. అలాగే తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ తో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అటు సగటు ప్రేక్షకుడికి కూడా టీజర్ చాలా బాగా నచ్చింది. అలా టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతున్న అజ్ఞాతవాసిపై ఆ సినిమాలో నటించిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఒక అందమైన ట్వీట్ చేసింది.

అసలు అజ్ఞాతవాసి టీజర్ లో ఖుష్బూ ని డైరెక్ట్ గా చూపెట్టకుండా ఆమె పాత్రని దాచేసిన చిత్ర బృందం.. ఆమెను కేవలం వెనక వైపుగా చూపించి ఆమె పాత్ర మీద హైప్ క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఖుష్బూ.. అజ్ఞాతవాసి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించింది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో నటించడం చాలా ఆనందంగా ఉందని.... ఓ అద్భుతమైన టీమ్ తో కలిసి వర్క్ చేశాను. దర్శకుడు త్రివిక్రమ్ వల్లనే ఇదంతా సాధ్యమైందని.... నా గుండె లోతుల్లోంచి త్రివిక్రమ్ కు థ్యాంక్స్ చెబుతున్నానని... పక్కా జెంటిల్ మ్యాన్ పవన్ తో వర్క్ చేయడం మరపురాని అనుభూతి. నాకు ఈ అవకాశం ఇచ్చిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కు కృతజ్ఞతలు... అంటూ ఒక అజ్ఞాతవాసి పోస్టర్ ని జతచేసి మరీ ట్వీట్ చేసింది.

ఇలా చిత్రబృందం లోని కీలకమైన ముగ్గురు వ్యక్తుల్ని ఖుష్బూ పొగడ్తల్లో ముంచెత్తింది. మరి ఆమె పాత్రకి అజ్ఞాతవాసి లో ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది క్రిష్టమస్ కానుకగా విడుదలయ్యే అజ్ఞాతవాసి ట్రైలర్ లో అయినా రివీల్ చేస్తారో.. లేదంటే జనవరి పది సినిమా విడుదలయ్యేవారు హైప్ క్రియేట్ చేస్తారో అనేది మాత్రం కాస్త సస్పెన్స్. ఇకపోతే రేపు మంగళవారం హైదరాబాద్ లో విడుదలకాబోయే అజ్ఞాతవాసి ఆడియో వేడుకకి ఖుష్బూ కూడా హాజరవుతుంది.

Similar News