మరీ ఘోరం భయ్యా!!

Update: 2018-02-10 13:57 GMT

సాయి ధరమ్ తేజ్ - వినాయక్ కాంబోలో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఇంటిలిజెంట్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే అందరూ పరమ రొటీన్ గా ఉందని పెదవి విరిచారు. ఇక సినిమా విడుదలైన మొదటి షోకే ఇంటిలిజెంట్ కి బ్యాడ్ టాక్ వచ్చేసింది. సినిమా మరీ ఘోరంగా ఉందని... వినాయక్ మరీ రొటీన్ సినిమా తియ్యడమే కాదు... దర్శకుడిగా ఈ జెనరేషన్ కి తగ్గట్టుగా అప్ డేట్ అవ్వలేదని... టాక్ వచ్చేసింది. ఇంకేముంది ఆ టాక్ కాస్త ఇంటిలిజెంట్ కలెక్షన్స్ మీద పడింది. అలాగే సినిమాలో సాయి ధరమ్ కూడా రొటీన్ గానే ఉన్నాడని... ఇలాంటి కథలతో కోకొల్లలుగా సినిమాలు వచ్చేశాయని.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అయితే గ్లామర్ ఆరబొయ్యడానికి తప్ప ఎందుకు పనిరాదనే దారుణమైన టాక్ తో ఇంటిలిజెంట్ సినిమా డిజాస్టర్ టాక్ ని మొదటి షోకే తెచ్చుకుంది. మరీ ఆ టాక్ వలన కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. మొదటి రోజు ఇంటిలిజెంట్ సాయి ధరమ్ కెరీర్ లోనే ఘోరమైన కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. సాయి సినిమా ల్లో డిజాస్టర్స్ అయిన తిక్క, విన్నర్ సినిమాలు కూడా ఇంటిలిజెంట్ కలెక్షన్స్ తో పోల్చి చూస్తే పర్వాలేదనిపించాయి. మరీ ఇంటిలిజెంట్ మొదటి రోజు కలెక్షన్స్ ఒక్కసారి చూస్తే పోలా..

ఏరియాల వారీగా ఇంటిలిజెంట్ కలెక్షన్స్

నైజాం: 0 .55

సీడెడ్: 0 .31

ఆంధ్ర: 1 .44

టోటల్ ఏపీ మరియు టీఎస్ షేర్: 2 .30 కోట్లు

Similar News