మరీ అంత మొహమాటామా?

Update: 2017-10-08 13:55 GMT

బాహుబలికి ముందు ప్రభాస్ అంటే కేవలం తెలుగు, తమిళ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. కానీ బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ప్రపంచ స్థాయిలో బాహుబలి ప్రభాస్ గా కీర్తింపబడుతున్నాడు. బాహుబలి దెబ్బకి ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభాస్ మార్కెట్ ఎంతగా విస్తరించినా ప్రభాస్ ఆ మార్కెట్ ని బాహుబలితో వచ్చిన క్రేజ్ ని ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రభాస్ కి ప్రతిదానికి బిడియం, మొహమాటం చాలా ఎక్కువ గనక. ఆ విషయమే ప్రభాస్ కూడా మొహమాట పడుతూ చెబుతున్నాడు.

అసలు తనకున్న స్టార్ డమ్ ని ఎలా డీల్ చెయ్యాలో కూడా తనకి తెలియదని.. తనకున్న బిడియం కారణంగానే... పదేళ్లనుండే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ... ఇప్పటికి జనాల్లోకి వెళ్లాలంటే భయమని చెబుతున్నాడు. అలాగే సినిమాల పబ్లిసిటీలలో భాగంగా చేసే ఇంటర్వ్యూ లు అన్నా సిగ్గేనని... కానీ నా సినిమాలు చాలామంది జనాలు చూడాలి... సినిమాకి రావాలని అనుకుంటా.. కానీ వారిముందుకు నేను మాత్రం వెళ్లలేను. అలాగే అభిమానులతో ఎలా మసులుకోవాలో కూడా నాకు రాదు. కానీ ఇండస్ట్రీలోకొచ్చినప్పుడు కన్నా... ఇప్పుడు చాలా మెరుగయ్యానని చెబుతున్నాడు. అయితే ఇంకా చాలా మెరుగవ్వాలని... అందరితో మాట్లాడాలంటే పూర్తిగా బిడియం పోవాలని అంటున్నాడు.

ఇక సినిమాల్లోకి నాకు నేనుగా రాలేదు. అసలు సినిమాల్లో నటించాలంటే పెద్దగా ఇష్టంలేకుండా ఉండేది. అందుకే నన్ను సినిమాల్లోకి వెళ్ళమన్నప్పుడు వద్దని చెప్పా. మా నాన్న నిర్మాత, పెదనాన్న నటుడు వాళ్లిద్దరు నన్ను సినిమాల్లోకి వెళ్ళమని చెప్పినప్పుడు అంతమంది ముందు... నేను ఎలా నటించగలను అని అనుకున్నా... అందుకే సినిమాలు కాకుండా.... ముందుగా బిజినెస్ చెయ్యాలనుకున్నా. కానీ ఒక రోజు నాకు జ్ఞానోదయం కలిగి సినిమాల్లోకి వచ్చానని చెబుతున్నాడు. ఇంతకీ ప్రభాస్ కి ఎలా జ్ఞానోదయం అయ్యిందో తెలుసా? ప్రభాస్ ఒకరోజు పొద్దున్నే బాపు గారి దర్శకత్వంలో తన పెదనాన్న కృష్ణంరాజు నటించిన ఒక సినిమా చూస్తూ.. ఆయన పాత్రలో తనని తాను ఊహించుకున్నాడట. అప్పుడు నెమ్మదిగా ప్రభాస్ కి నటుడు కావాలనే ఆలోచన బలపడి అప్పుడే సినిమాల్లోకి వచ్చానని చెబుతున్నాడు. అదండి ప్రభాస్ కి ఉన్న మొహమాటం.

Similar News