మందు పార్టీలో ప్రభాస్. ఆ కిక్కే వేరప్పా..!!

Update: 2017-12-20 11:19 GMT

అక్కినేని అఖిల్ తాజా మూవీ హలో రేపు స్క్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం అఖిల్ 'హలో' మూవీని ప్రమోట్ చేసే పనుల్లో లో బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే అమెరికాలో 'హలో ప్రమోషన్స్ ని ముగించుకుని ఇండియాకి వచ్చిన అఖిల్ గత రెండు రోజుల ఇక్కడకూడా 'హలో' ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు. 'హలో' ప్రమోషన్ లో భాగంగా అఖిల్ అనేకరకాల ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నాడు. ఇక అందులో మచ్చుకి ఒక ఇంటర్వ్యూలో అఖిల్ ని ప్రభాస్ గురించి అడిగిందో యాంకర్.

ఎందుకంటే అఖిల్, రానా, రామ్ చరణ్, ప్రభాస్, మంచు మనోజ్ వీళ్లంతా బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు పార్టీలలో వీరంతా కలిసి ఎంజాయ్ చేస్తారనే విషయం తెలిసిందే. అయితే సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు వెంటనే అఖిల్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ, మందు పార్టీలో ప్రభాస్ ఉంటే భలే మజాగా ఉంటుందని అన్నాడు. అంతకుమించి డిటైల్స్ ఏమి చెప్పలేను కానీ..... ప్రభాస్ ఏదైనా పార్టీలో ఉంటే మాత్రం ఆ కిక్కే వేరు అని చెప్పాడు ఈ అక్కినేని హీరో. తాను ఎప్పుడు పార్టీ చేసుకున్నా అది రానాతోనే అన్న అఖిల్.... తను రానా కలసి పార్టీ చేసుకుంటే ప్రభాస్ కూడా ఉండాలని కోరుకుంటానని అన్నాడు.

అలాగే రానా నేను కలిసినప్పుడు ఎక్కువగా ప్రభాస్ గురించే మాట్లాడుకుంటాం అని అన్నాడు. ప్రభాస్ ఎక్కువ గా పార్టీలకి రాడు కాని ఉంటే మాత్రం అందరితో చాలా గౌరవంగా, జాలీ గా ఉంటాడు అని బాహుబలి ప్రభాస్ ని అక్కినేని చిన్నోడు పోగుతున్నాడు.

Similar News