మంచుతో చెర్రీ ఆటలు

Update: 2017-12-30 16:00 GMT

రామ్ చరణ్ భార్య ఉపాసన చెప్పే మాటలు వింటుంటే..ఆమె చరణ్ గురించి డీటైలింగ్ ఇచ్చే విధానం పరిశీలిస్తే.. స్నేహితుని గురించి చెప్పినట్లే ఉంటుంది. అందుకు తగ్గట్టు ఇద్దరు భలే ఎంజాయ్ చేస్తారు.లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో చుస్తే మనకే అర్ధం అవుతుంది.

ఇంకో రెండు రోజుల్లో న్యూఇయర్ వచ్చేస్తోంది. చలి కాలంలో మంచుతో ఆడుకుంటూ ఉంటే భలే మజాగా ఉంటుంది. అలానే మంచుతో ఆడుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది ఉపాసన. అయితే ఈ వీడియో ఉపాసన తో పాటు రామ్ చరణ్ ఫ్రెండ్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఎంజాయ్ చేయడం విశేషం. చెర్రీ ఫ్యామిలీకి సానియా మీర్జా బాగా సన్నిహితురాలు. అనేక ఈవెంట్లలో.. కార్యక్రమాల్లో రామ్ చరణ్ తో పాటు కానీ.. ఉపాసనతో పాటు కానీ కనిపిస్తుంటుంది సానియా.

ఇప్పుడు ఈ ఆటలో కూడా వీరిద్దరితో పాటు దర్శనమిచ్చింది. నేలపై నుంచి మంచు తీసి చెర్రీ అందిస్తుంటే.. ఉపాసన - సానియా మీర్జా ఇద్దరూ ఆ మంచును గాల్లోకి ఎగరేస్తూ భలే ఆడుకుంటున్నారు. రివర్స్ యాప్ ఉపయోగించి.. మళ్లీ ఆ మంచు తిరిగి చేతిలోకి వస్తున్నట్లుగా ఎడిటింగ్ చేసిన వీడియోను.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన. ఈ వీడియో సాధారణ ప్రేక్షకుడితో పాటు మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తోంది.

Similar News