మంచి పాత్ర లభిస్తే.. దేనికైనా రెడీ!!

Update: 2017-07-03 16:28 GMT

రవిబాబు 'అవును' సినిమాలో నటించి శెభాష్ అనిపించుకున్న పూర్ణ కి సినిమాల్లో ఓహో అన్నంత రోల్స్ ఏమి లేవు. ఇక హీరోయిన్ గా కాకపోయినా కనీసం ఐటెం గర్ల్ గా అయినా స్థిరపడదామని చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది. అయినా సినిమాలో చిన్న చితక హీరోయిన్ కేరెక్టర్ చేస్తున్న పూర్ణ సినిమా వేషం కోసం గుండు కొట్టించుకున్న టాక్‌ ఆఫ్‌ది టౌన్‌ అయింది.

ఇటీవల మిస్కిన్‌ నిర్మించిన 'సవరకట్టి'లో ఇద్దరు పిల్లల తల్లిగా అద్బుతంగా నటించింది. తనకు ఆపాత్రను ఇచ్చినందుకు నిండు సభలో ఉద్వేగం ఆపుకోలేక బోరున ఏడ్చింది. ఇక ఆమెకు ఎలాగూ హీరోయిన్‌ అవకాశాలు రావడం లేదు కాబట్టి ఇకపై వాటి ఆశ వదులుకుని, చేసిన, వచ్చిన కొన్ని అవకాశాలనైనా సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్‌ అయింది. తాజాగా ఆమెకు తమిళ దర్శకుడు ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్‌ హీరోగా నటిస్తున్న 'కొడివీరన్‌'లో బలమైన , నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించింది.

పాత్ర రీత్యా దీనికి గుండులో ఉండాల్సి రావడంతో ఎందరు విగ్గులలో మెయిన్‌టెయిన్‌ చేద్దామని వారిస్తున్నా కూడా గుండు కొట్టించుకుని, దానిదేముంది. మంచి పాత్ర లభిస్తే ఎలాగైనా నటించడానికి సిద్దమని ప్రకటించింది. పోనీ ఈ చిత్రంలో ఆమె హీరోయినా అంటే కాదు... హీరోయిన్‌ పాత్రను మహిమా నంబియార్‌ చేస్తోంది.

Similar News