భావన సెటిల్ కాబోతుంది

Update: 2017-12-17 07:35 GMT

మళయాళనాటి భావన మొన్నామధ్యన కిడ్నాప్ వ్యవహారంలో కాస్తంత నలిగినా.. మల్లి కోలుకుని కెరీర్ పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలోను సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే భావన ఒక పక్క సినెమాలతోను.. మరోపక్క తన చిరకాల మిత్రుడు నవీన్ ను పెళ్లాడనుంది. కన్నడలో భావన చేసిన ఓ సినిమాకు నవీన్ నిర్మాతగా వ్యవహరించాడు. అప్పుడే భావన, నవీన్ లు ప్రేమలో పడ్డారు. ఇక పెళ్ళిలో భాగంగా మార్చి 9న కేరళలోని త్రిసూర్ లో వీళ్లకు ఎంగేజ్ మెంట్ కూడా అయింది. అలా నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోంది.

ఆ ప్రేమికుల జంట వివాహానికి తేదీ ఖరారైంది. ఈనెల 22న కుటుంబ సభ్యుల సమక్షంలో త్రిస్సూర్ లో నవీన్, భావన లు ఒక్కటికాబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన భావన.. పెళ్లి తర్వాత ఇచ్చే విందును కూడా రద్దుచేసినట్టుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన భావన.... ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

Similar News