భారీగానే ఎక్కిస్తున్నాడు!!

Update: 2017-07-22 14:00 GMT

రజినీకాంత్ 'కబాలి' ఫేమ్ రంజిత్ పా డైరెక్షన్ లో 'కాలా' చిత్రాన్ని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపు దిద్దుకుంటున్న ఈ కాలా చిత్రం రజినీకాంత్ కెరీర్ లో రెండో అతిపెద్ద భారీ చిత్రంగా చెబుతున్నారు. శంకర్ డైరెక్షన్ లో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న '2.0 ' చిత్రం ఇండియాలోనే అత్యధిక భారీ బడ్జెట్‌ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అయితే ఇదివరకు రజినీకాంత్ నటించిన ‘యందిరన్‌’ రూ.130 కోట్లతో మొదటిస్థానంలో ఉంది.

అయితే ఇప్పుడు మాత్రం 'కాలా' చిత్రాన్ని ధనుష్ రూ.160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ‘యందిరన్‌’ను వెనక్కినెట్టి ‘కాలా’ రెండో స్థానం సంపాదించుకోనుందని అంటున్నారు. మరి కోలీవుడ్ మీడియాలో 'కాలా' చిత్రం అత్యంత ప్రతిష్ట్మాకంగా భారీ బడ్జెట్ తో ధనుష్ నిర్మిస్తున్నాడని.... కథనాలు వెలువడుతున్నాయి. 'కాలా' చిత్రం మొదలుపెట్టిన కొత్తలోనే ‘కాలా’ కథ, టైటిల్‌ తనవేనంటూ రాజశేఖరన్‌ అనే వ్యక్తి కేసు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు పా.రంజిత్‌, నిర్మాత ధనుష్‌, రజనీకాంత్‌ తరపున దాఖలైన బదులు పిటిషన్‌లో సినిమా బడ్జెట్‌ను రూ.160 కోట్లు పేర్కొన్నట్లు సమాచారం.

ఈ లెక్కన కాలా బడ్జెట్ చాలా ఎక్కువే పెడుతున్నారు. మరి రంజిత్ చెప్పిన 'కాలా' కథను నమ్మి ధనుష్ ఇంత భారీగా పెట్టుబడి పెట్టడం మాత్రం విశేషంగానే చెప్పాలి. మరి రంజిత్ పా ఇంతకుముందు రజినీకాంత్ తో తెరకెక్కించిన 'కబాలి' చిత్రం ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ప్లాప్ డైరెక్టర్ ని నమ్మి ఒక నిర్మాత ఇంతగా పెట్టుబడి పెడుతున్నాడు అంటే అది రజిని మీద ఉన్న నమ్మకమే కారణమేమో. మరి ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పక్కర్లదు.

Similar News