భామలు అస్సలు తగ్గడంలేదు

Update: 2017-09-19 08:00 GMT

దక్షిణాది హీరోయిన్స్ బికినీ లు వేసుకుని గ్లామర్ షో చెయ్యడానికి ఇప్పుడు అస్సలు తగ్గడంలేదు. ఇక తాజాగా చాలా సినిమాల్లో బికినీ షో షురూ అయ్యింది. దక్షిణాది భామలు కూడా ఉత్తరాది భామలు వాలే బిందాస్‌గా టూపీస్ స్విమ్ సూట్‌లో తెగ సందడి చేస్తున్నారు. తాప్సీ, ల‌క్ష్మీరాయ్‌ లాంటి వారు తాజాగా ఆమె బాలీవుడ్ సినిమాల్లో త‌మ స్విమ్ సూట్ సోయ‌గాల‌ను వెండితెర‌పై ఆరబోస్తున్నారు. సినిమాల్లో ఆమ‌ధ్య పెద్ద పెద్ద హీరోయిన్లు ఎవ‌రూ బికినీ ధ‌రించేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపేవారు కాదు.. కానీ ఇప్పుడు చాలా మంది ట్రేండ్ మార్చారు. అవ‌కాశాలు రావాలంటే, క్యారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే.. ఏ పాత్ర‌కైనా రెడీ అంటున్నారు కొంద‌రు హీరోయిన్లు.

గతంలో నయనతార, అనుష్క వంటి హీరోయిన్లు బిల్లా వంటి సినిమాల్లో ఇలాంటి అంద‌చందాల షో చేశారు. అయితే అనుష్క ఇప్పుడు వాటికి దూరంగా ఉంటోంది.... కానీ నయనతార మాత్రం వాటికీ పెద్దగా నో చెప్పదు. తాజాగా తాప్సీ బికినీ షోతో కాంట్ర‌వ‌ర్సీ అయ్యింది. ఆమె లేటెస్ట్‌గా న‌టించిన జుడ్వా 2లో బికినీలో త‌న సోయగాల‌ను ఆరబోయ‌నుంది. ఆ ఫొటోల‌నే ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అసలు ర‌గ‌డ మొద‌లైంది. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన నెటిజ‌న్ల‌కు త‌న‌దైన స్గైల్లో చుర‌క‌లంటించింది. నా బాడీ నా ఇష్టం అంటూ సెల‌విచ్చింది ఈ భామ‌.

జూలీ 2 సినిమాతో ల‌క్ష్మీరాయ్ కూడా అలాగే అందాల‌ను ఆర‌బోయ‌నుంది. మొన్నటివరకు టీజర్, ట్రైలర్స్ తోనే రెచ్చిపోయిన లక్ష్మీరాయ్ ఇప్పుడు రోజుకో ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికి మత్తెక్కిస్తోంది. అందమైన నాజూకు నడుముతో చాలా స్లిమ్ గా అయినా లక్ష్మి, బికినీ అందాల ఆరబోత మాములుగా లేదు. ఇక లక్ష్మిరాయ్ నటించిన జూలీ 2 అక్టోబర్ 6 న విడుదలకాబోతుంది.

Similar News