భాగమతి సెన్సార్ టాక్ ఏమిటంటే..?

Update: 2018-01-19 09:44 GMT

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భాగమతి’ . జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 26న విడుదల కు సిద్దమవుతుంది. ఈమధ్యనే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఈ చిత్రం పై భారీ అంచనాల్ని పెంచేసింది. జనవరి 26న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు / ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో ఇబ్బందికరంగా ఉన్న పదాలను మ్యూట్ చేసింది సెన్సార్ బోర్డు. కానీ ఈ చిత్రానికి సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెయ్యకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం చిత్ర బృందాన్ని ఆనందానికి గురి చేసింది.

ఇకపోతే భాగమతి చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు... ఈ చిత్రం బాగా వచ్చిందని దర్శకనిర్మాతలకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్ర కథాకథనం సూపర్ అని... అనుష్క నటన ఈ చిత్రానికే హైలెట్ అని తెలుస్తుంది. అయితే ఈ చిత్ర ఫస్ట్ హాఫ్ ని కథలోని ముఖ్యాంశాలు తెలపడానికి వాడగా... సెకండ్ హాఫ్ మాత్రం ఇరగదీశారని తెలుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో 20 నిముషాలు ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుని పోయేలా చేస్తుందని అంటున్నారు. ఇక ఆ 20 నిమిషాల్లో అనుష్క నటన ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయమనే మాట వినబడుతుంది.

ఇక బాహుబలి తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. అనుష్క మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ఉన్నిముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానేర్ పై వంశీ – ప్రమోద్ నిర్మించారు. థమన్ సంగీతం అందించాడు.

Similar News