టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంటరై మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేసిన భామ అను ఇమ్మాన్యువల్. నాని సరసన 'మజ్ను' సినిమాలో నటించిన అను ఇమ్మాన్యువల్ ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కూడా నటించి మెప్పించింది. అయితే అను మాత్రం ఏమంత పెద్ద అందగత్తె కూడా కాదు. కానీ ఆమెకి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం దండిగా వచ్చిపడుతున్నాయి. సమంత, కాజల్, రకుల్ లా అందాలు ఆరబొయ్యకపోయినా కూడా ఆమెకి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి అంటే అనుకు ఎక్కడో సుడి ఉండి ఉండాలి.
అందుకే కెరీర్ ఆరంభంలోనే పవన్ కళ్యాణ్ అంతటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసి టాప్ హీరోయిన్స్ కి సైతం జ్వరం తెప్పించింది. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో అను ఇమ్మాన్యువల్ సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఆ సినిమా ఇంకా ఫినిష్ కాకుండానే అల్లు అర్జున్ - వక్కంతం కాంబినేషన్లో రాబోతున్న 'నా పేరు సూర్యా' లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యి ఔరా అనిపించింది. మరి కెరీర్ ఆరంభంలోనే అను ఇలా స్టార్ట్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేస్తూ షాకులమీద షాకులిస్తుంది.
అయితే ఇప్పుడు మరో న్యూస్ అను గురించి ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే అను ఇమ్మాన్యువల్ ని త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసాడనే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. త్రివిక్రమ్, పవన్ తో చేసే సినిమా కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమాకోసం అనుని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇది నిజమే అయ్యుంటుందని అంటున్నారు. ఎందుకంటే త్రివిక్రంతో చేసే హీరోయిన్స్ నటనకు త్రివిక్రమ్ ఇంప్రెస్స్ అయితే వారిని వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో సెలెక్ట్ చేసే అలవాటు మొదటి నుండి ఉంది కాబట్టే... ఈ న్యూస్ గాసిప్పయ్యే అవకాశం లేదంటున్నారు.
మరి నిజంగా ఎన్టీఆర్ సరసన కూడా అను ఇమ్మాన్యువల్ నటిస్తే ఆమె పంట పండినట్లే. పవన్ సినిమాలో ఎంపికైనప్పుడే అను లక్కీ గర్ల్ అను కొనియాడారు. అలాగే అల్లు అర్జున్ మూవీలో ఫైనల్ అయినప్పుడు అను కి అదృష్టం పట్టిందన్నారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో కూడా సెట్ అయితే అనుకి అదృష్టం జిడ్డులా తగులుకుందంటారు.