భలే ప్లాన్ చేస్తున్నారుగా

Update: 2017-08-16 13:00 GMT

మహేష్ టాలీవుడ్ లో టాప్ హీరోగా వున్నాడు. మహేష్ సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమా కి ఓపెనింగ్స్ కూడా ఒకరేంజ్ లో విచ్చేస్తాయి. గత ఏడాది బ్రహ్మ్మోత్సవం డిజాస్టర్ అయినప్పటికీ ఇప్పుడు వస్తున్న స్పైడర్ మీద భారీ అంచనాలున్నాయి. మురుగదాస్ డైరెక్షన్ లో తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న దాసరి కానుకగా రెండు భాషల్లోనూ విడుదల కాబోతుంది. అయితే మహేష్ బాబు ఇప్పటివరకు తన సినిమాలను డబ్బింగ్ చేస్తూ తమిళ్ లో విడుదల చేస్తున్నాడు గాని ఇప్పటివరకు డైరెక్ట్ తమిళ్ మూవీ చెయ్యలేదు. ఇక స్పైడర్ కోసం మహేష్ ఓన్ గా తమిళ డబ్బింగ్ కూడా చెప్పేసుకున్నాడు.

మరి తమిళంలో స్పైడర్ తో అడుగుపెడుతున్న మహేష్ ని తమిళులకు పరిచయం చెయ్యాలి అంటే... ఆ పరిచయం ఒక రేంజ్ లో ఉండాలి. అందుకే మహేష్ ని తమిళులలో గ్రాండ్ గా పరిచయం చెయ్యడం కోసం స్పైడర్ సినిమా ఈవెంట్ ని ఒకదాన్ని చెన్నై లో భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు స్పైడర్ చిత్ర యూనిట్ వాళ్ళు. సెప్టెంబర్ 9న చెన్నైలో స్పైడర్ సినిమాకి సంబందించిన ఒక ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది. ఆ ఈవెంట్ లోనే మహేష్ పరిచయ కార్యక్రమం గ్రాండ్ లెవల్లో ఉండబోతుందని చెబుతున్నారు.

ఇక ఆ స్టేజ్ పైకి మహేష్ ఎలా రావాలి, ఎలా కనిపించాలి వంటి అంశాలపై ఇప్పటికే ఓ స్పెషల్ కాన్సెప్ట్ ను డిజైన్ చేసి పెట్టారట కూడా. మరి మహేష్ తమిళ పరిచయ కార్యక్రమం మాములుగా ఉండదట.... అది తమిళలుకి ఎప్పటికి గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో పేరు సంపాదించి.... చాలామంది తమిళ సినీ ప్రముఖులకు సన్నిహితుదుగా ఉన్న మహేష్ తమిళ పరిచయ కార్యక్రమం కోసం ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటే తమిళనాడు అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తుంది.

Similar News