ఈ సంక్రాంతికి విడుదల అయినా సినిమాలు పక్కన పెడితే..జై సింహ సినిమా మాత్రం మంచి టాక్ తెపించుకుని మంచి కలెక్షన్లు దక్కించుకుంది. దాదాపు అన్ని ఏరియాస్ లో బయ్యర్లకు ఈ సినిమా లాభాలను తెచ్చిపెడుతోంది. జై సింహా రూ. 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉంది. అలానే లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిపారు.
ఈ మధ్య కాలం హీరోస్ నిర్మాతలకి కనీస మర్యాద ఇవ్వట్లేదని..తన ఆవేశాన్ని వ్యక్తం చేసారు. ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ తగ్గిపోతోందని.. ఇది బాధాకరమైన పరిణామమని అంటున్నారు బాలయ్య. గతంలో నిర్మాతలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదని వాపోతున్నారు.
‘‘డైరెక్టర్ - హీరో ఓ గదిలో కలిసి కూర్చుని వాళ్లే అన్నీ మాట్లాడేసుకుంటారు. కనీసం ప్రొడ్యూసర్ కు తమ మనసులోని మాట ఇదని చెప్పరు. అన్నీ వాళ్లే డిసైడ్ చేసేస్తారు. ఈ పద్ధతైతే కరెక్ట్ కాదు. కచ్చితంగా ప్రొడ్యూసర్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. నా వరకు ప్రొడ్యూసర్ కు ప్రతి విషయం చెబుతాను’’..ఇలా సక్సెస్ మీట్ లో ప్రస్తావిస్తూ తనకి నిర్మాతల పట్ల వున్న గౌరవాన్ని చాటారు బాలకృష్ణ.