ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా పుకార్లకు అస్సలు కొదవే ఉండదు. ఒక స్టార్ హీరోతో ఒక స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు అంటూ భలే రూమర్స్ పుట్టించేస్తుంటారు కొందరు గాసిప్ రాయుళ్లు. అలాగే ఒకే సినిమాలో ఒక హీరో, హీరోయిన్ కలిసి నటిస్తే చాలు వారిద్దరి మధ్యన ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించేస్తారు. తమకిష్టమైన హీరో ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తే బావుంటుందని ఆ హీరోగారి ఫ్యాన్స్ తమకి తామే ఊహించేసుకుని మరీ ప్రచారం చేపట్టేస్తారు.
అసలు ఈసోదంతా ఇప్పుడు ఎందుకంటే రాజమౌళి బాహుబలి చిత్రం విడుదలై ఇన్నిరోజులు కావొస్తున్నా కూడా రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ప్రకటించలేదు. అందుకే రాజమౌళిని లింక్ చేస్తూ టాలీవుడ్లోని స్టార్ హీరోలందరితో సినిమాలు తెరకెక్కించే పనిలో పడ్డారు చాలామంది గాసిప్ రాయుళ్లు. రాజమౌళి బాహుబలి సినిమా అవ్వగానే రాజమౌళి, అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రకరకాల హీరోలతో రాజమౌళి కి లింక్ చేశారు అది వేరే విషయం.
ఇప్పుడు తాజాగా తన కొడుకుతో సినిమా చెయ్యమని అల్లు అరవింద్ రాజమౌళి వెంటపడుతున్నాడని.... డీజే తో ఇరకాటంలో ఉన్న అల్లు అర్జున్ ని ఎలాగైనా డైరెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అరవింద్, రాజమౌళిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో అస్సలు నిజం లేదంటున్నారు అరవింద్ సన్నిహితులు. అల్లు అరవింద్ గారు కొన్ని రోజుల ముందే అమెరికా వెళ్లారు. ఆయన అక్కడ తమ కుటుంబంతో టైం స్పెండ్ చేస్తూ బిజీగా వున్నారు. అసలు ఇక్కడ మెగా ఫ్యాన్స్ అంతా ఏకమై డీజే విషయంలో దిల్ రాజు ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న సంగతి ఇంకా ఆయనకు తెలియదు. అసలు ఆ విషయమై ఆయన ఇంకా హైదరాబాద్ కి రానేలేదు. అలాంటిది తన కొడుకు సినిమా గురించి అమెరికా నుండే రాజమౌళి మీద ప్రెజర్ ఎలా తెస్తారు. అసలు ఇక్కడలేకుండానే అటువంటి విషయాన్నీ ఎలా డీల్ చేస్తారంటూ మండిపడ్తున్నారు.
ఇకపోతే రాజమౌళి మాత్రం ఎవ్వరి ప్రెజర్ కి లొంగడనేది జగమెరిగిన సత్యం. అందులోను అరవింద్ తో రాజమౌళికి చెడిందనే న్యూస్ ఉండనే వుంది. మరి అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా అనేది మాత్రం ఒట్టి పుకారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఫ్యూచర్ లో మాత్రం బన్నితో రాజమౌళి వర్క్ చేస్తాడేమో ఎవ్వరు చెప్పలేరు.