గత రెండు రోజుల నుడి వరుణ్ సందేశ్ వైఫ్ వితిక సేరు ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిందంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వితిక సేరు మీడియాకెక్కి ఫేక్ న్యూస్ అని చెప్పినప్పటికీ నిన్న బుధవారం ఈ న్యూస్ టాప్ ట్రేండింగ్ అయ్యింది. అయితే వితిక ఇంట్లో ఎవరు లేని సమయంలో నిద్ర పట్టక నాలుగు నిద్ర మాత్రలు వేసుకున్న మాట వాస్తవమే అని... కానీ మెలకువ రాకపోయేసరికి హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని వితిక చెబుతుంది. అక్కడ హాస్పిటల్ లో తన ఫ్రెండ్ సెల్ఫీ తియ్యడం వలెనే ఈ న్యూస్ ఇంతలా స్ప్రెడ్ అయ్యిందని అది కేవలం పుకారే అని ఆమె కొట్టిపడేసింది.
అయితే మీడియాలో వస్తున్న ఈ గాసిప్ కి వరుణ్ సందేశ్ కుటుంబం కాస్త ఫీల్ అయినట్లుంది. అందుకే వరుణ్ సందేశ్ తన భార్యతో తాను చాలా చక్కగా వున్నానని... తామిద్దరం అన్యోన్యంగానే ఉంటున్నామని... తన భార్య అసలు సూయిసైడ్ అట్టెంప్ట్ చెయ్యలేదని ఇలాంటి గోసిప్స్ పుట్టించద్దు అంటూ ట్విట్టర్ లో స్పందించాడు. వరుణ్ సందేశ్ - వితిక ఇప్పుడు ప్రస్తుతానికి విడివిడిగానే వుంటున్నారు. కారణం వితిక తన పనులతో ఇండియాలో బిజీగా ఉంటే వరుణ్ సందేశ్ కి చేతిలో సరైన్ సినిమాలు లేక అమెరికా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక వీరి పెళ్ళై వచ్చే నెలకి ఏడాది కావోస్తుండడంతో వీరి పెళ్లిరోజు సెలెబ్రేషన్స్ గురించి ప్లాన్స్ చేసుకుంటున్నారట.