ఒక్కపుడు తెలుగు సినిమా వేరు. ఎక్కడ నుండి కాపీ కొట్టి తీసిన ఎవరికి తెలిసేది కాదు. కానీ బాహుబలి పుణ్యమా అంటూ.. మన తెలుగు సినిమా ప్రపంచం మొత్తం తెలిసిపోవడంతో మన సినిమాలపై కన్నేశారు హాలీవుడ్ వాళ్లు. ఏ సినిమా కాపీ కొట్టిన వెంటనే ఆ విషయం బయటికి వచ్చేస్తుంది.
అలానే అజ్ఞాతవాసి కూడా ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ను కాపీ కొట్టే త్రివిక్రమ్ తీసాడని ఆ సినిమా డైరెక్టర్ కి కూడా తెలిసిపోయి కామెంట్లు చేసాడు. అయితే ఇప్పుడు మహేష్ నటిస్తున్న భరత్ అను నేను సినిమా కథ కూడా...ఓ హాలీవుడ్ మూవీ నుంచే కాపీ కొట్టారని టాక్ వస్తుంది.
1995లో అమెరికాలో విడుదలైన ది అమెరికన్ ప్రెసిడెంట్ సినిమానే ఈ తెలుగు సినిమాకు స్పూర్తి అని టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ హాలీవుడ్ మూవీలో హీరో అమెరికా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. రెండు బిల్లులను పాస్ చేసే విషయంలో చాలా ఇబ్బందులకు గురవుతాడు. తరువాత ఎన్నికలు దగ్గరకు వస్తుంటాయ్. ఆ సమస్యలు నుండి హీరో ఎలా బయటపడ్డాడో అదే కథ. మరి ఇది నిజమో కాదో మనం అప్పుడే చెప్పలేం కాబ్బట్టి సినిమా బయటికి వచ్చేవరకు వెయిట్ చేయాలి.