టాలీవుడ్ లో ప్రస్తుతం కాపీ అనే పదం తెగ బయపెటేస్తుంది. అగ్న్యాతవాసితో ఈ భయం మరింత ఎక్కువ అయింది. అందుకే మన దర్శకనిర్మాతలు స్టోరీల విషయంలో ఒకటికి రెండుసార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఐన కానీ కొన్నికొన్ని సార్లు ఒక సినిమాకు ఇంకో సినిమాకు పోలిక రావడం సహజం.
అయితే మహేష్ 'భరత్ అను నేను' సినిమాపై కూడా అటువంటి పోలిక ఒకటి వస్తుంది. లేటెస్ట్ గా తమిళం లో హిట్ అయిన నయనతార నటించిన 'ఆరమ్' అనే సినిమాతో 'భరత్ అను నేను' సినిమాను పోలుస్తున్నారు. 'ఆరమ్' సినిమా నయనతార బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే ఒక ఐఎఎస్ ఆఫీసర్ గా నయనతార కనిపించింది. ఈ సినిమా తెలుగులో మార్చి 16న 'కర్తవ్యం' అంటూ విడుదలవుతోంది. అప్పట్లో విజయశాంతి కర్తవ్యం ఎంత హిట్టయ్యిందో.. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.
మహేష్ సినిమా టీజర్ చూస్తే.. ప్రజల కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మహేష్ చెబుతుంటే.. ఇక్కడ నయనతార ఇంకో తరహాలో చెబుతోంది అనిపిస్తోంది. 'భరత్ అను నేను' మహేష్ ప్రజలచే ఎన్నుకున్న నాయకుడు..ఇక్కడ నయనతార ఒక గవర్నమెంట్ సర్వెంట్. అంతే తేడా ఆలోచనలూ ఆశయాలూ ఒకేలా కనిపిస్తున్నాయి పోలికలు చెబుతున్నారు. కానీ మనం ఇప్పుడు దాక చెప్పుకుంది ఈ రెండు సినిమాల టీజర్స్ చూసి. సినిమాలు చూస్తేనే కానీ మనం అనుకుంది కరెక్టా కాదా అనేది చెప్పలేం.