బ‌న్నీ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్ట‌ర్‌తోనా..!

Update: 2017-12-29 07:29 GMT

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ ఉర‌ఫ్ బ‌న్నీతో సినిమా చేసేందుకు చాలా మంది ద‌ర్శ‌కులు క‌ల‌లు కంటుంటారు. ఈ జాబితాలో చాంతాండంత‌ లిస్ట్ ఉన్నా ఆ ఛాన్స్ మాత్రం త‌క్కువ మందికే వ‌స్తుంది. డీజే సినిమాతో ఈ యేడాది యావ‌రేజ్‌ను త‌న ఖాతాలో వేసుకున్న బ‌న్నీ ప్ర‌స్తుతం స్టార్ స్టోరీ రైట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నా పేరు సూర్య సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో ఉంటుందా ? అన్న‌దానిపై ఓ క్లారిటీ వచ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. తాజాగా బ‌న్నీ త‌మ్ముడు శిరీష్‌తో ఒక్క క్ష‌ణం సినిమా తీసి మంచి మార్కులు వేయించుకున్న వి ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

బ‌న్నీతో ఎప్ప‌టి నుంచో సినిమాలు చేయాల‌నుకుంటున్న ఆనంద్ బ‌న్నీ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో మ‌ధ్య‌లో గ్యాప్‌లో శిరీష్‌తో ఒక్క క్ష‌ణం సినిమా చేశాడు. ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు కూడా వ‌స్తున్నాయి. సినిమా టాక్ బ‌ట్టి బ‌న్నీ కూడా ఆనంద్ పనితీరు పట్ల ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. బ‌న్నీతో ముందు నుంచి అనుకున్న క‌థ‌తోనే ఆనంద్ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాత ఎవ‌రు ? ఇత‌ర సాంకేతిక నిపుణులు ఎవ‌రు అన్న‌ది ? త్వరలోనే వెల్ల‌డ‌య్యే ఛాన్సులు ఉన్నాయి.

Similar News