గత రెండు నెలలుగా ఏపీ, తెలంగాణ లో 50 శాతం మంది విజయవాడ వీరమాచినేని రామ కృష్ణ డైట్ అంటూ రోజూ చికెన్, మటన్, బటర్, కోకోనట్ ఆయిల్ లాంటివి తినేస్తూ రైస్ ని అవాయిడ్ చేస్తూ ఎక్సరసైజ్ అనేది లేకుండా వారానికే కిలోలు కిలోలు తగ్గిపోతూ... షుగర్, థైరాయిడ్ లాంటి వ్యాధులను దరిచేరనీయకుండా రామకృష్ణ గారి డైట్ ని ఫాలో అవుతున్నారు. అయితే అచ్చం అలాంటిదే.....ఇప్పుడు మీకు మిల్కి మైటీ తమన్నా చెప్పబోయే డైట్ కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే కానీ... తమన్నా చెప్పే డైట్ మాత్రం వీరమాచినేని వారి డైట్ కన్నా ఇంకా వీజీ.
తనలాగే స్లిమ్ గా నాజూగ్గా అవ్వాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదని... జిమ్ లో వర్కౌట్స్, జాగింగ్, గేమ్స్... ఎక్సరసైజ్ లు లాంటివివాటితో కష్టాలు పడకుండా.... కేవలం తాను చెప్పబోయే పని చేస్తే బరువు ఈజీగా తగ్గిపోవచ్చని చెబుతుంది ఈ బ్యూటీ తమన్నా. కేవలం బటర్ కాఫీ తాగితే చాలంటే బరువు దానంతట అదే తగ్గిపోతుంది. మరి అందరూ బటర్ దోశె, బటర్ మిల్క్ లాంటి వి విన్నాం కానీ.. ఇలా బటర్ కాఫీ మాత్రం ఫస్ట్ టైం వింటున్నాం .. ఈ కాఫీ తాగితే వెయిట్ లాస్ ఈజీ అని చెబుతుంది ఈ హీరోయిన్.
మాములు కాఫీలో బటర్ ను మిక్స్ చేసి తాగితే.... కొవ్వు దానంతట అదే కరిగిపోతుందని బ్యూటీ చిట్కా చెబుతుంది. కేవలం బరువే కాదండోయ్...ఈ కాఫీ తాగితే హృదయానికి మంచిదని, రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుందని ఉచిత సలహా పడేస్తుంది తమన్నా. అలాగే తన ఆరోగ్యానికి రహస్యం ఇదేనంటూ తమన్నా తాను ఇంత స్లిమ్ గా ఉండడానికి గల సీక్రెట్ ని బయటపెట్టేసింది. మరి సినిమాల్లో బిజీగా వున్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి టిప్స్ చెప్పని తమన్నా ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఖాళీ అయ్యాక ఇలాంటి బ్యూటీ టిప్స్ చెబుతుంది అంటే మరి ఆలోచించాల్సిందే.