బ్యాచ్ భలేగా వుంది కదూ

Update: 2017-11-21 14:00 GMT

1980 లలో కలిసి నటించిన అగ్రసినీతారలు గత నాలుగైదేళ్లుగా ఏదో ఒక చోట కలిసి ఒక నాలుగైదు రోజులు తనివితీరా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మాత్రం ఖుష్బూ, రాధికా శరత్ కుమార్ లే. వీరిద్దరూ ప్రతి ఏడు 1980 లలో నటించిన నటీనటులందరిని గెదర్ చేస్తూ అందరు కలిసి బాగా ఎంజాయ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, మెగాస్టర్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, సుహాసిని వంటి వారు ఉన్నారు. వీరంతా కలిసి ప్రతియేటా ఒక్క చోట కలుసుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. ఈఏడాది కూడా వీరంతా కలిసి చైనా ట్రిక్ కి కూడా వెళ్లారు. ఈ ట్రిప్ లో చిరు భార్య సురేఖ తో కలిసి పాల్గొన్నాడు.

ఇక అక్కడ వాళ్ళు తీసిన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు పండగ తెస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రాధికా శరత్ కుమార్ 1980 లో నటించిన నటీనటులతో కూడిన ఒక అరుదైన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఆ పిక్ తోపాటు 1980 నాటి ఫ్రెండ్స్‌తో లవ్‌లీ వీకెండ్ అంటూ కామెంట్ జత చేసింది రాధిక. ఆ ఫోటోలో చిరంజీవి, వెంకటేష్, భానుచందర్, సుహాసిని, రాధ, జయసుధ, రమ్యకృష్ణ వంటి వారంతా ఉన్నారు. ఇక ఆఫోటోలోని నటీనటులంతా ఒకే కలర్ దుస్తుల్లో కనబడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరు ఓ సారి ఆ పిక్ ని చూసి తరించండి.

Similar News