స్టార్టింగ్ సినిమానే పెద్ద డైరెక్టర్ తో పెద్ద హీరోయిన్ తో చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్. తన తర్వాత సినిమాలు కూడా స్టార్ హీరోయిన్స్ తో చేసాడు. వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, శ్రీవాస్ లాంటి పెద్ద డైరెక్టర్లతో...అలానే సమంత..రకుల్ ప్రీత్..పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ తో డ్యూయెట్ వేసాడు.
మొదటి సినిమా నుండి కాస్టింగ్ విషయంలో ఏమి రాజీ పడేదే లేదు బెల్లంకొండ శ్రీనివాస్. అలానే విల్లన్స్ విషయంలో కూడా అంతే. ఇక లేటెస్ట్ గా ఇతను ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విల్లన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో ఒక్కప్పుడు హీరోగా చేసిన నీల్ నితిన్ తర్వాత విలన్ పాత్రలు చేయటం మొదలుపెట్టాడు.
విల్లన్ గా ఇతను తొలి చిత్రం తమిళ్ లో కత్తి మూవీ చేసాడు అది సూపర్ హిట్ అయింది. దీని తర్వాత ప్రభాస్ ‘సాహో’లో విల్లన్ గా నటిస్తున్నాడు. దాని తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేస్తాడు. విలన్ల విషయంలోనూ రేంజ్ మెయింటైన్ చేయడానికి శ్రీనివాస్ ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశమవుతోంది.ఇదేకాకుండా ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తుందని సమాచారం. అయితే ఇవి ఆఫిషల్ న్యూస్ కాదు. అధికార ప్రకటన కోసం వెయిట్ చేయాలి