బుల్లితెర నుండి వెండితెరకి మరో యాంకర్

Update: 2017-11-12 15:00 GMT

బుల్లితెర మీద కొందరు నటి నటులు హిట్ అవగానే... వాళ్ళు వెండి తెరపై దర్శనమిస్తుంటారు. జబర్దస్త్ కామెడీ షో ఎంతమందిని పాపులర్ చేసిందో మనకు తెలుసు. ముఖ్యంగా అందులో యాంకర్స్ గా చేసిన అనసూయ మరియు రష్మీ సినిమాల్లో ఎంత బిజీ అయిపోయారో అందరికి తెల్సిసిందే. టీవీ హోస్ట్ రవి కూడా ఆల్రెడీ హీరోగా మారి ఓ సినిమాలో నటించాడు.

ఇప్పుడు ఇంకో టీవీ హోస్ట్ కూడా వెండి తెరపైకి దర్శనం ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో మోస్ట్ పాపులర్ టీవీ హోస్ట్ గా వున్న ప్రదీప్ మాచిరాజు హీరో కావడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మణికండన్ దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా నటించే సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుగుతోంది. ఇదొక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ప్రదీప్ ఆల్రెడీ 'జులాయి’,‘అత్తారింటికి దారేది’,‘భం బోలేనాథ్’ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసాడు. ఇప్పుడు ఏకంగా హీరో గా నటించాలనుకుంటున్నాడట. అయితే ఈ సినిమాపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది

Similar News