'బాహుబలి'లా.. 'సై... రా' పబ్లిసిటీని చెయ్యగలరా?

Update: 2017-08-27 14:00 GMT

చిరంజీవి 151 మూవీ 'సై రా నరసింహారెడ్డి' చిత్రం గురించి ఎటువంటి క్లూ ఇవ్వకుండా సీక్రెట్ గా పూజ కార్యక్రమాలు జరిపిన చిత్ర టీమ్ లోగో లాంచ్, మోషన్ పోస్టర్ ని మాత్రం గ్రాండ్ గా లాంచ్ చేసింది. అయితే 'సై రా' టైటిల్ లీకైనప్పడు ఈ టైటిల్ అస్సలు బాగోలేదు... ఈ సినిమాకి 'ఉయ్యాలవాడ' అనే పెట్టాల్సింది అన్నవారికి మోషన్ పోస్టర్ తో సమాధానం చెప్పింది చిత్ర టీమ్. మోషన్ పోస్టర్ లో చిరు బ్యాక్ లుక్, అలాగే సినిమాలో నటించే నటీనటులతో పాటు ప్లే అయిన 'సై 'రా లోగోకి బాగానే కనెక్ట్ అయ్యారు జనాలు. ఇక మోషన్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రం దీన్ని ఇండియా వైడ్ గా పబ్లిసిటీ చెయ్యడంలో మాత్రం సక్సెస్ సాధించలేకపోయిందనే టాక్ వినబడుతుంది.

అయితే 'బాహుబలి' సినిమాని రాజమౌళి ప్రభాస్ హీరోగా, రానా విలన్ గా సినిమా మొదలు పెడుతుండగానే ఇండియా వైడ్ గా ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చేసింది. అయితే ఇంతలా పబ్లిసిటీ రావడానికి కారణం మాత్రం సోషల్ మీడియా, మీడియానే. బాహుబలి సినిమాగురించి సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం 'బాహుబలి' సినిమా విజయానికి ఎంతో తోడ్పడింది. రాజమౌళికి, బాహుబలికి మీడియా ఇచ్చిన హై పబ్లిసిటీ ఇండీయా వైడ్ గానే కాకుండా ప్రపంచం మొత్తం 'బాహుబలి' వైపు చూసేలా చేసింది. ఆవిధమైన పబ్లిసిటీ వలనే బాహుబలి సగం సక్సెస్ సాదించినసంగతి తెలిసిందే.

మరి 'సైరా నరసింహారెడ్డి' లో కూడా సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ చిత్ర టీమ్ కలిసి ఇండియాలోని టాప్ నటులను, అలాగే టాప్ టెక్నీషియన్స్ ని దింపినా సినిమాకి జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకురాలేకపోతున్నారు. మరి 'బాహుబలి' టీమ్ వలే, సోషల్ మీడియాని 'సై రా' టీమ్ కూడా వాడుకుంటే సినిమాకి మంచి హైప్ తోపాటు క్రేజ్ కూడా వస్తుంది. మరి 'బాహుబలి' సోషల్ మీడియాని వాడుకున్న కిటుకులు కనిపెట్టి 'సై రా' టీమ్ కూడా అలాంటి దారిలోనే ప్రయత్నిస్తే మాత్రం జాతీయంగా ఈ సినిమా పేరు వస్తుంది. మరి ఆ రకమైన పబ్లిసిటీ కోసం భారీ బడ్జెట్ తో 'సై రా' ని నిర్మిస్తున్న చరణ్, అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డిలు ఎలాంటి ప్లాన్స్ చేస్తారో చూద్దాం.

Similar News