ఇప్పుడు భారత దేశం లో ఏ భాష చిత్రమైనా, అది ఎంత పెద్ద హీరో చిత్రమైనా, ఎంత బాగా ఆడినా ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్ అనే మాట ఎక్కడా వినపడటం లేదు. నాన్ బాహుబలి రికార్డు అనే మాట తరచుగా వినిపిస్తూ వుంది. 2015 లో బాహుబలి ది బిగినింగ్ వచ్చి తెలుగు తోపాటు దక్షిణాది సినిమాలలో ఈ రికార్డు తాకటం అసాధ్యమని చాటి చెప్పిన రెండు సంవత్సరాలకే బాహుబలి ది కంక్లూషన్ వచ్చి దేశవ్యాప్తంగా ఏ స్టార్ హీరో టచ్ చెయ్యలేని ఇండస్ట్రీ హిట్ నెలకొలిపి మిగిలిన వారందరికీ నాన్ బాహుబలి రికార్డు అనే మాట అలవాటు చేసి వెళ్ళింది.
ఈ సంక్రాంతి పండుగకి భారీ స్థాయిలో విడుదల అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞ్యాతవాసి చిత్రం గ్రాండ్ ఓపెనింగ్స్ కి ఇప్పటికే రంగం సిద్దమైన సంగతి విదితమే. సాధారణ టికెట్ రేట్ కంటే అధిక ధర వసూళ్లు చేసుకునే వెసులుబాటుతో పాటు పెయిడ్ ప్రీమియర్స్ కి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం రాత్రి 1 నుంచి ఉదయం పది గంటల సమయం మధ్యన అదనపు ప్రదర్శనలు చేసుకునే వెసులుబాటు అజ్ఞ్యాతవాసి కి కలిపించటంతో ఓవర్ అల్ క్లోసింగ్ షేర్ బాహుబలి ని తాకలేనప్పటికీ తెలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో బాహుబలి రికార్డు అధిగమించే స్థాయిలో అజ్ఞ్యాతవాసి ఓపెనింగ్స్ వుండబోతున్నాయనటంలో అతిశయోక్తి లేదు. మరి ఈ ఫిగర్ ఎంతకి చేరుతుందో మరి కొద్దీ రోజులలో తేలనుంది