పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. అజ్ఞాతవాసి అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతోందని..భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా 209 థియేటర్లలో విడుదలౌతోందని తాజాగా ఒక పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాహుబలిని మించి అజ్ఞాతవాసి యూఎస్ లో రిలీజ్ అవుతుందని అందరిలో ఆసక్తిని రేకెత్తించింది ఈ పోస్టర్. అయితే నిజానికి బాహుబలి కంటే ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావడంలేదు. ఇక్కడ పీవీఆర్, సినీమ్యాక్స్ వలే అమెరికా లో ఉన్న 'సినీ మార్క్' అనే ఒక చైన్ ఆఫ్ థియేటర్స్ లలో మాత్రమే ఇది ఒక రికార్డు.
'సినీ మార్క్' లో 209 థియేటర్స్ లో ఒక తెలుగు సినిమా రిలీజ్ కావడం రికార్డు కావొచ్చని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ అది బాహుబలి కంటే ఎక్కువ థియేటర్లలో అమెరికాలో రిలీజ్ అవుతోందనుకోవడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు.