విడుదలై సుమారు 8 నెలలు కావొస్తున్నా ఇప్పటికీ బాహుబలి చిత్రం పేరు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంది. ఆ చిత్రం చూపించిన ప్రభావం అటువంటిది. మనిషి ఊహాశక్తికి అందని అద్భుతాల్ని రాజమౌళి ఈ చిత్రం ద్వారా చూపించాడు. ఎత్తైన జలపాతాలు.. 100 అడుగుల భళ్లాలదేవుని విగ్రహం.. ఇలా ఎన్నో వింతలు ఈ చిత్రంలో చూశాము. అన్నింటికీ మించి భారత్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక్క ప్రశ్న కోసం 18 నెలల పాటు వేచి చూశారు. ఆ ప్రశ్నే ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’. బాహుబలి చిత్రం విడుదలైనప్పటినుండి ఈ ప్రశ కోసం వేచి చూడని సినీ అభిమాని ఉండదు.
ఇప్పుడు తాజాగా ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ సంవత్సరం భారత్ లో ట్రెండ్ అయిన టాప్ 10 విషయాలను వెల్లడించింది. ఈ సంవత్సర కాలంలో భారత్ లో ఎక్కువ మంది మాట్లాడుకున్నది మన ‘బాహుబలి 2’ చిత్రం గురుంచే.. ఈ టాప్ 10 జాబితాలో బాహుబలి మొదటి స్థానం సంపాదించింది. ఈ సంవత్సరం సూపర్ హిట్ అయిన ఐపీఎల్ , దంగల్ లు సైతం బాహుబలి తరువాత స్థానంలోనే నిలవడం విశేషం.
భారత్ లో ట్రెండ్ అయిన టాప్ 10 జాబితా ఇదే :
1 : బాహుబలి – 2
2 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ )
3 : లైవ్ క్రికెట్ స్కోర్
4 : దంగల్
5 : హాఫ్ గర్ల్ ఫ్రెండ్
6 : బద్రీనాథ్ కి దుల్హనియా
7: మున్నా మైఖేల్
8 : జగ్గా జాసూస్
9 : ఛాంపియన్స్ ట్రోఫీ
10 : రయీస్