బాహుబలి సీరీస్ వచ్చింది అదరగొట్టింది... వెళ్ళింది. అయితే బాహుబలి పార్ట్ 1 , బాహుబలి పార్ట్ 2 లను తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి బాహుబలి 3 ఉంటుందా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్సు లో పడేసాడు. అయితే ఇప్పుడు బాహుబలి సీరీస్ నిర్మాత ఒకరు బాహుబలి 3 గురించి ఎవ్వరూ ఊహించని విషయాన్నీ వెల్లడించారు. తాజాగా సిఎన్ఎన్ ఐబీఎన్ ఇండియన్ అఫ్ ద ఇయర్ అవార్డుని వివిధ రంగాలకు చెందిన వారికి ప్రధానం చేసింది. ఈ ఈవెంట్ కి హాజరైన శోభు యార్లగడ్డ ఈవెంట్ లో బాహుబలి 3 గురించి అసలు విషయాన్ని చెప్పి బాంబు పేల్చారు.
బాహుబలి 3 ఉంటుందా అన్న ప్రశ్నకి సమాధానంగా శోభు... వెంటనే అయితే ఉండదు కానీ భవిష్యత్తులో ఉండొచ్చు అంటూ తన మనసులోని మాటని బయటపెట్టాడు. ఇంకా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ తానూ ఇప్పటికీ బాహుబలి సెట్స్ లోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నానని అన్నారు. బాహుబలి ప్రయాణం చాలా పెద్దదని దాని హ్యంగోవర్ నుంచి బయటకు రావడం చాలా కష్టమని ఆయన అన్నారు. ఇక శోభు బాహుబలి 3 ఉంటుంది అని చెప్పగానే బాహుబలి ఫాన్స్ అందరూ ఖుషి అయిపోయారు.
మరి శోభు ఈ విషయాన్నీ రాజమౌళి కి తెలిసే మాట్లాడాడా? ఒకవేళ తెలిసి మాట్లాడితే... రాజమౌళి కాంపౌండ్ లో బాహుబలి 3 ని ఎప్పటికైనా తెరకేక్కిన్చాలనే చర్చలు జరిగాయా? అనే డౌట్ మాత్రం అందరిలో క్రియేట్ అయ్యింది. ఏది ఏమైనా బాహుబలి 3 ఉంటె మాత్రం సూపర్ అంటున్నారు ప్రేక్షకులు.