బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్నది ఇదే!

Update: 2017-10-02 05:06 GMT

'బాహుబలి' వంటి భారీ బడ్జెట్ సినిమాని ఐదేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన రాజమౌళి... ఆ సినిమాతో కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుని జాయతీయ స్థాయిలో కీర్తింపపడుతున్నాడు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి ప్రాజెక్టు ఏమిటా అని అందరూ తెగ ఆలోచించుకొనేలా చేసాడు. దేశం మొత్తం రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమే కాచుకుని కూర్చుంది. కానీ రాజమౌళి ఎక్కడా ఆ విషయంపై నోరు విప్పడంలేదు. అలాగే చేతల్లోనూ చూపించకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయం పక్కన పడేసి రాజమౌళి ఇప్పుడు తనకిష్టమైన పనిలోకి దిగిపోయాడు.

రాజమౌళి 'బాహుబలి'తో సంపాదించిన డబ్బుతో హైదరాబాద్‌ శివార్లలోని 120 ఎకరాల భూమిని కొనుకున్న సంగతి తెలిసిందే. దానిలో 50 ఎకరాలు మామిడి, సపోటా చెట్ల పెంపకానికి, మరో 50 ఎకరాలు వ్యవసాయానికి కేటాయించాడు. ఇంకా కొన్ని ఎకరాలలో తన ఫాంహోస్‌ని నిర్మించుకుంటున్నాడు. ఇక ఇతర హంగామాలు, తన వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు, ఇతర సదుపాయాలపై ఇప్పుడు జక్కన్న దృష్టి పెట్టాడు. మొత్తానికి రాజమౌళి తన డ్రీమ్‌ప్రాజెక్ట్‌ 'మహాభారతం' విషయం పక్కనపెట్టి తన ఫామ్‌హౌస్‌, వ్యవసాయ క్షేత్రాల డ్రీమ్‌ ప్రాజెక్ట్‌కి మాత్రం రెడీ అయిపోయాడు.

అంతేకాకుండా ఈ పొలంలో చిన్న చిన్న గుడిసెలను కూడా నిర్మించి అందులో ఆవులను పెంచే గోసంరక్షణ కేంద్రం పెట్టాలని రాజమౌళి యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి రాజమౌళి ఏదైనా ఎంతో డిఫ్రెంట్ గా చేస్తాడనేది మాత్రం పక్కా కదండీ.

Similar News