బాలీవుడ్ సినిమా హిట్ అయితే టాలీవుడ్ కి!

Update: 2018-02-06 09:11 GMT

టాలీవుడ్ లో తక్కువ కాలంలో ఎక్కువ హిట్స్..ఎక్కువ డిజాస్టర్స్ చవి చూసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కానీ టాలీవుడ్ ఈ మధ్య ఆమెకు అంతగా ఆఫర్స్ ఏమి రావట్లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పాప ఫోకస్ మొత్తం బాలీవుడ్ మూవీ అయ్యారి సినిమాపైనే వుంది.

టాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుందని టాక్ వచ్చినా అవి ఇంకా ఆఫీసియల్ గా బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చూపు అయ్యారి సినిమాపైనే ఉంది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే ఈ ప్రొమోషన్స్ లో బిజీగా వుంది రకుల్. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆమెకి నిద్ర పట్టేలా లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రకుల్ చేతిలో ఈ సినిమా కాకుండా కోలీవుడ్ హీరో సూర్యతో ఒక్క సినిమా...అలానే బాలీవుడ్ లో ఇంకొ మూవీ ఉన్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఒక్క మూవీ అయినా ఉండివుంటే బాగుండు అని అందరు అనుకుంటున్నారు. రకుల్ కి చేద్దాం అని ఆలోచన వున్న స్పైడర్ డిజాస్టర్ అవ్వడంతో అమ్మడుకి టాలీవుడ్ లో ఆఫర్స్ ఏమి రావడంలేదు. బాలీవుడ్ అయ్యారి సినిమాతో హిట్ కొట్టి..టాలీవుడ్ లో 'ఐ యామ్ బ్యాక్' అంటుందేమో చూడాలి.

Similar News