బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ గా సోనమ్ కపూర్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రతి దానిలో కొత్తదనం కోరుకునే సోనమ్ కపూర్ సినిమా కథల విషయంలోనూ అంతే కొత్తదనం కోరుకుంటుంది. కథ నచ్చితేనే సినిమాలు చేస్తుంది. అందుకే బాలీవుడ్ లో హీరోయిన్ గా కన్నా సోనంకపూర్ కి ఫ్యషన్ ఐకాన్ గానే పేరుంది. అయితే టాప్ హీరోల సరసన ఎలాంటి పాత్ర ఇచ్చినా ఒప్పేసుకుని నటిస్తున్న నటినమణులు ఉన్న ఈ కాలంలో సోనమ్ మాత్రం కథ మీద ఏదన్న డౌట్ ఉంటె దర్శకుడికే డైరెక్ట్ గా చెప్పేస్తుంది అంటుంటారు బాలీవుడ్ లో కొంతమంది. సినిమాల్లో ట్రెడిషన్ పాత్రల్లో ఎక్కువగా కనబడే సోనమ్ బయట అవార్డు ఫంక్షన్స్ కి గట్రా సూపర్ హాట్ గా దర్శనమిస్తుంది.
ఇక సోనమ్ కపూర్ ప్రస్తుతానికి రాజ్ కుమార్ హిరని తెరకెక్కిస్తోన్న సంజయ్ దత్ బయోపిక్ లో నటించడమే కాకుండా అలాగే మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేసింది. అయితే ఫోటో షూట్స్ లోను కూడా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే సోనమ్ కపూర్ కావలిస్తే హాట్ గా కనబడుతుంది. లేకుంటే ట్రెడిషనల్ గా కనబడి ఆకట్టుకుంటుంది. ఇప్పుడు కూడా సోనమ్ తాజాగా వోగ్ మ్యాగజైన్ కోసం కొత్త లుక్స్ లో ఒక ఫోటో షూట్ చేయించుకుంది. అందులో కొత్త లుక్స్ లో అందంగా కనబడుతుంది. ఆ ఫొటోలో అందంగా.. ఆకర్షణీయంగా కనబడుతున్న సోనమ్ ని చూస్తుంటే మత్స్యకన్యలా కనబడుతుంది అంటున్నారు.
ఒక బొమ్మలా కనబడుతున్న సోనమ్ మాత్రం సూపర్ లుక్స్ లో ఆకట్టుకుంటుంది. మరి ఎప్పుడూ కొత్తగా ఉండాలనుకునే సోనమ్ కపూర్ ఇప్పుడు ఈ ఫోటో షూట్ లో నిజంగానే కొత్తందాలతో మెరిసిపోతుంది. మరి సోనమ్ కపూర్ లుక్ ని మీరు ఓ లుక్కేయండి.