బాలీవుడ్ నుండి కొరియోగ్రాఫర్ ని దించుతున్నాడా?

Update: 2017-12-02 11:00 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ తర్వాత డాన్స్ పరంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ముందంజలో ఉంటారు. ఈ ముగ్గురి డాన్స్ కి ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఫిదా అవుతుంటారు. ఈ స్టార్ హీరోలు కూడా ఎప్పటికప్పుడు కొరియోగ్రాఫర్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు. దాదాపుగా వీరు ప్రేమ్ రక్షిత్, గణేష్, జానీ, శేఖర్ మాస్టర్ లతో పని చేస్తుంటారు. ఇక వీరందిరిలో అల్లు అర్జున్ డాన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాడు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా స్పెషల్ స్టెప్పుల్లో డాన్స్ ట్రై చేస్తాడు.

అల్లు అర్జున్ నటించిన బద్రీనాధ్ సినిమా ప్లాప్ అయినప్పటికీ అందులోని అల్లు అర్జున్ డాన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఇక హీరోయిన్స్ కూడా అల్లు అర్జున్ తో స్టెప్స్ వేయాలంటే ఒకింత కంగారు పడుతుంటారనే నానుడి ఉంది. ఇక బన్నీ తో కొరియోగ్రఫీ చేయడమంటే డ్యాన్స్ మాస్టర్స్ కూడా చాలా ఆసక్తిని చూపుతుంటారు. అయితే అల్లు అర్జున్ బాలీవుడ్ టాలెంట్ ఉన్న కోరియోగ్రాఫర్స్ ని కూడా బాగానే వాడుకున్నాడు. తెలుగులో అయితే జాని.. శేఖర్.. ప్రేమ రక్షిత్.. ఇలా అందిరితో పనిచేశాడు. విశేషం ఏంటంటే బాలీవుడ్ డ్యాన్స్ మాష్టర్లైన గణేష్ మరియు బోస్కో ను కూడా బన్నీ ఈమధ్యనే రంగంలోకి తెచ్చాడు.

అంతేకాదు ఇప్పుడు మరో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ని నా పేరు సూర్య కి దించబోతున్నాడు. హమ్మా హమ్మా రీమిక్స్, ఉడే దిల్ బేఫికరే, స్వాగ్ సే స్వాగత్ వంటి లేటెస్ట్ హిట్ సాంగ్స్ కి కోరియేగ్రాఫీ చేసిన లేడి డ్యాన్స్ మాస్టర్ వైభవి మెర్చంట్ ను అల్లు అర్జున్ నా పేరు సూర్య కోసం సెలెక్ట్ చేసుకున్నాడని తెలుస్తోంది. వైభవి డ్యాన్స్ కంపోజిషన్లు కు పడిపోయి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ లేడి కొరియోగ్రాఫర్ వెంట పడుతున్నారంటే.. మన బన్నీ గట్టి కొరియోగ్రఫర్ నే తీసుకొస్తున్నాడన్నమాట.

Similar News