బాలీవుడ్ లో రూమర్స్ కి వున్న క్రేజ్ ఇంకెక్కడా ఉండదేమో. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూడా పెరగటం.. అందుకు తగ్గ వెబ్ సైట్స్..చానెల్స్.. పుట్టుకొచ్చి ఇష్టమొచ్చినట్టు రుమౌర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. సెలబ్రెటీలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఏ మాత్రం ఆగడం లేదు. గత రెండేళ్లనుండి బాలీవుడ్ లో ఓ ప్రేమ జంట పైన అనేక రూమర్స్ వస్తున్నాయి.
హీరోయిన్ గా రికమెండ్ చేసి....
ఆ జంట ఎవరో కాదు...టైగర్ ష్రాఫ్ - దిశా పటాని. వీరిద్దవారిపై బాలీవుడ్ మీడియాలో అనే రూమర్స్ వచ్చాయి. ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లటంతో అంత నిజమే అనుకున్నారు. ఏ పార్టీకి వెళ్లినా..ఏ ఈవెంట్ వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్ళుతున్నారు. వాస్తవానికి హీరోయిన్ దిశా పటాని బాలీవుడ్ లో అంతగా ఆఫర్స్ ఏమి రావట్లేదు. అందుకే 'భాగీ' సినిమాలో హీరోయిన్ గా రికమాండ్ చేసాడంట టైగర్ ష్రాఫ్.
బ్రేకప్ అయిందా?
అయితే తాజాగా వీరిద్దరి చెడినట్లు నార్త్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించే 'భాగీ' దర్శకుడు అహ్మద్ ఖాన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్సర్ కూడా ఇచ్చాడు. వారిద్దరూ సపరేట్ కార్లలో వస్తున్నారని.. కేవలం సీన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారు అనే తరహాలో వివరణ ఇవ్వడంతో బ్రేకప్ అయ్యిందా అని మరో కొత్త రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. గ్లామర్ ఫ్లీడ్ అంటే కలవడం విడిపోవడం ఇవ్వన్నీ కామనే కదా. ఇక క్షణం రీమేక్ గా వస్తున్నా 'భాగీ 2' ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.