బాలీవుడ్ కి పక్కానా..?

Update: 2017-07-06 13:00 GMT

టాలీవడ్ లో తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. అపజయమెరగని దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి సీరీస్ తో జాతీయ స్థాయిలో కీర్తిని మూటగట్టుకున్న రాజమౌళి తన నెక్స్ట్ చిత్రం ఎవరితో తెరకెక్కిస్తాడో అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే వుంది. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తున్న కథకి సరిపోయే హీరోని వెతుక్కుని మరీ సినిమా మొదలు పెడతానని రాజమౌళి ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. అయితే బాహుబలితో రాజమౌళి బాలీవుడ్ కి చెక్కేస్తాడని చాలామందే అనుకున్నారు. కానీ రాజమౌళి వైపు నుండి అలాంటి ప్రయత్నాలేమీ జారకపోయేసరికి గమ్మునుండిపోయారు.

అయితే ఇప్పుడు మళ్ళీ రాజమౌళి బాలీవుడ్ బాట పడుతున్నాడంటున్నారు. రాజమౌళికి బాహుబలితో బాలీవుడ్ లో మంచి డిమాండ్ వచ్చేసింది. ప్రస్తుతానికి బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ రాజమౌళితో సినిమాలు నిర్మించేందుకు రెడీగా వున్నారు కూడాను. అయితే ఇందుకు రాజమౌళి కూడా సానుకూలంగా ఉన్నాడనే వార్తలు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. తన తండ్రి రాసే కథతో రాజమౌళి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడట. అయితే బాలీవుడ్ లోని బిగ్ ప్రొడక్షన్ హౌస్‌ ద్వారా తన బాలీవుడ్ ఎంట్రీ వుండాలని రాజమౌళి భావిస్తున్నాడట.

ఇక తాను చెయ్యబోయే చిత్రంలో ఏ హీరోని తీసుకున్నప్పటికీ ఆ చిత్రం మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి. అయితే రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక నిర్మాత దగ్గర ఒక కోటి అడ్వాన్స్ తీసుకుని ఉన్నాడట. అయితే తన నెక్స్ట్ చిత్రం అయన నిర్మాణంలోనే చేయాలి కాబట్టి ఆ నిర్మాతని బాలీవుడ్ నిర్మాతలతో భాగస్వామిని చేసి .... టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతల కాంబినేషన్ లో బాలీవుడ్ మూవీని డైరెక్ట్ చెయ్యడానికి రాజమౌళి పావులుకదుపుతున్నట్టు టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.

Similar News