బాలయ్యా... ఇదేంటయ్యా..

Update: 2017-09-17 08:33 GMT

బాలకృష్ణ 'పైసా వసూల్' రికార్డు టైం లోనే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కావడం....ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడడం అన్ని చక చక జరిగిపోయాయి. ఇక బాలకృష్ణ 'పైసా వసూల్' ప్లాపుని పక్కన పడేసి తన 102 వ చిత్రం మీద ఫోకస్ పెట్టాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 102 వ చిత్రాన్ని చేస్తున్న బాలకృష్ణ కి జోడిగా ఈ చిత్రంలో సౌత్ టాప్ హీరోయిన్ నయనతార నటిస్తుంది. మరొక ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఒకరు నటాషా దోషి కాగా మరొకరిని ఇంకా ఫైనల్ చెయ్యాల్సి ఉంది. ఇక ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది.

ఇక రవి కుమార్ - బాలకృష్ణ కలయితే కొత్త అంటే ఆ సినిమా కథ కూడా ఇంకా కొత్తగా వుంటుందట. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ పెళ్లి కాకుండా ఉండిపోయే 'పెళ్లి కాని ప్రసాద్' పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. చాలా వయసొచ్చినా పెళ్లి, గిళ్లి లేకుండా ఒంటారిగానే ఉండిపోతాడట. అయితే బాలకృష్ణ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటనేది ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారట. ఇక బాలయ్య ప్రేమించిన నయనతార వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో..... భగ్న ప్రేమికుడిగా మారతాడట. అయితే సినిమా సెకెండాఫ్ లో నయనతార మళ్లీ బాలయ్య జీవితంలోకి రావడంతో కథ మలుపుతిరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ కథ వినడానికి బాగానే కొత్తగా వుంది.

అయితే బాలకృష్ణ అలా పెళ్లిచేసుకోకుండా ఎందుకు ఉండిపోయాడో అనే విషయాన్నీ మరో హీరోయిన్ ద్వారా దర్శకుడు సినిమాలో చెప్పిస్తాడనే టాక్ కూడా వినబడుతుంది. ఇకపోతే ఈ బాలయ్య - కేఎస్ రవికుమార్ ల కలయికలో వస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు.

Similar News