బాలయ్యని పడెయ్యడానికేనా..?

Update: 2017-07-28 11:08 GMT

బాలకృష్ణ - పూరి జగన్నాధ్ ల పైసా వసూల్ స్టంపర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ స్టంపర్ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ లాంటి స్టార్‌ను తన శైలికి తగ్గట్టుగా మార్చేసి, అదిరిపోయే లుక్‌లో బాలయ్య ని చూపించి అభిమానులు మెచ్చుకునే విధంగా చేసి సక్సెస్ అయ్యాడు పూరీ. ఈ స్టంపర్ లో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. పైసా వసూల్ స్టంపర్ చాలా కొత్తగా ఉందని టాలీవుడ్ లోని ప్రముఖులు పూరీని, బాలకృష్ణ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇక ఈ స్టంపర్ చూసిన పూరి జగన్నాధ్ గురువుగారు... రామ్ గోపాల్ వర్మ అయితే పైసా వసూల్ స్టంపర్ సూపర్ సూపర్ డూపర్ అంటూ మెచ్చుకున్నాడు. బాలకృష్ణను ఫస్ట్ టైం ఇలాంటి లుక్‌లో చూస్తున్నానని, బాలయ్య మాత్రం చాలా బాగున్నాడని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మరి వర్మ ట్వీట్ చూస్తుంటే పూరి కోసం చేసినట్టు లేదు. బాలకృష్ణ ని పడెయ్యడానికే వర్మ అలాంటి ట్వీట్ చేసాడంటున్నారు.

ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యనఎన్టీఆర్ బయో పిక్ తీస్తానంటూ మీడియాలో తెగ హల్చల్ చేసాడు. కానీ వర్మ చెప్పిన వాటికీ బాలయ్య అసలు స్పందించనేలేదు. అందుకే వర్మగారు ఇప్పటివరకు నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు పైసా వసూల్ స్టంపర్ ని పొగిడేసి బాలయ్య బాబు దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ సెటైర్స్ పడుతున్నాయి.

Similar News