మహేష్ సో సో గా సినిమాలు చేస్తున్న టైం లో పూరి జగన్నాధ్ ఎలాంటి అంచనాలు లేకుండా మహేష్ తో పోకిరి సినిమాని ప్లాన్ చేసాడు. ఆ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఇండస్ట్రీ హిట్టై కూర్చోవడమే కాదు మహేష్ ని టాప్ హీరో, స్టార్ ని చేసేసింది. అప్పట్లో పూరి - మహేష్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. మహేష్ ని సినిమా మొదట్లో 'పోకిరి'గా చూపించి సినిమా చివరిలో మాత్రం ఎక్సలెంట్ అండర్ కవర్ పోలీస్ గా చూపించి బంపర్ హిట్ కొట్టిన పూరి ఆ తర్వాత చేసిన సినిమాలేమి పోకిరి ని క్రాస్ చేయలేకపోయాయి. మళ్ళీ అంతటి ఇండస్ట్రీ హిట్ ని పూరి మరే హీరోకి ఇవ్వలేకపోయాడు.
అయితే 'పోకిరి' వచ్చిన కొత్తలో ఆ జోనర్ లోనే బోలెడన్ని మూవీస్ తెరకెక్కి హిట్స్ కొట్టాయి. అలాగే ఫట్సు అయ్యాయి. అయితే పూరి జగన్నాధ్ ఇప్పుడు బాలకృష్ణ తో తెరకెక్కించే 'పైసా వసూల్' చిత్రం ట్రైలర్ చూస్తుంటే మహేష్ 'పోకిరి' ని తలపిస్తుందంటున్నారు. 'పోకిరి'లో మహేష్ ని చూపించిన విధంగానే 'పైసా వసూల్' లో బాలయ్యని కూడా అంతే రఫ్ గా చూపించాడనే ఫీల్ కలుగుతుందంటున్నారు కొందరు. మరి అడ్డ దిద్దాలుగా విలన్స్ ని చావచితక్కొడుతున్న బాలయ్య ఏదైనా అండర్ కవర్ ఆపరేషన్ కోసమే ఇలా చేస్తున్నాడా? అనే ఫీల్ తెప్పిస్తుంది.
'పోకిరి'లో మహేష్ సినిమా మొత్తం దున్నేసినట్లు.... 'పైసా వసూల్' స్క్రీన్ మీద బాలయ్య కూడా అదే దున్నుడు మొదలెట్టేసాడు. సినిమా మొత్తం బాలయ్యే కనబడతాడా అనిపించేలా వుంది 'పైసా వసూల్' ట్రైలర్ చూస్తుంటే. సినిమా మొత్తం బాలయ్య ఎనర్జీ, పూరి మార్క్ డైలాగ్స్ మీదే ఆధారపడి ఉందనే ఫీల్ ని 'పైసా వసూల్' స్టంపర్ తోపాటు ట్రైలర్ కూడా తెప్పించింది. పూరి తనేం చెయ్యాలనుకుంటాడో దాన్ని బట్టే సినిమాలో హీరో కేరెక్టర్ ని డిజైన్ చేస్తాడు. పూరి సినిమాల్లో హీరోలంతా క్లాస్ లుక్ కన్నా ఎక్కువగా రఫ్ లుక్, మాస్ లుక్ లోనే ఉంటారు. మరి పైసా వసూల్ లో బాలయ్య ఏ లుక్ చూసినా ఊర మాస్ లుక్ మాత్రమే కనబడుతుంది. దీని బట్టి పూరి, బాలయ్యతో 'పోకిరి 2 ' ని తీసాడా అనిపించేలా చేసాడు. మరి పూరి బాలయ్యతో... కొత్తగా ట్రై చేశాడా? లేదా అనేది సెప్టెంబర్ 1 వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది కంగారెందుకు.