బాలయ్యకి పోటీగా రానా?

Update: 2017-08-30 09:59 GMT

బాలకృష్ణ బయట ఎక్కడైనా స్టేజ్ మీద మాట్లాడాడు అంటే ఆ స్పీచ్ జనాలు ఎవ్వరికి సరిగ్గా అర్ధమే కాదు. ఏదేదో మాట్లాడేస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంటాడు. బయట బాలయ్య ఎలా మాట్లాడిన సినిమాలో మాత్రం భారీ డైలాగ్స్ అయినా... చాలా ఈజీగా అందరికి అర్ధమయ్యేలా మాట్లాడి అదరగొట్టేసాడు. సినిమాల్లో డైలాగ్ డెలివరీలోబాలకృష్ణ తో పోటీపడే హీరోలు ఉండరు అంటే అతిశయోక్తి ఉండదు. ఇప్పుడున్న యంగ్ హీరో ఒకరు డైలాగ్ డెలివరలో బాలయ్యకి పోటీ వచ్చాడంటున్నారు. బాలకృష్ణ తో యంగ్ హీరో రానా పోటీపడి మరి డైలాగులకు చెప్పాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

జెమినీ ఛానల్ లో రానా హోస్ట్ గా వస్తున్న నెంబర్ వన్ యారి షోలోకి పైసా వసూల్ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో బాలకృష్ణ లు వెళ్లారట. తాజాగా జరిగిన ఈ షో షూటింగ్ లో బాలయ్య బాబుతో రానా పోటీ పడి మరి డైలాగ్స్ చెప్పాడట. 'ఏమంటివి ఏమంటివి...' అంటూ సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ని రానా, బాలయ్య లు పోటీ పడి మరి చెప్పారట. ఈ ఒక్క డైలాగ్, నెంబర్ 1 యారి ఎపిసోడ్ కే హైలెట్ అంటున్నారు. మరి బాలయ్య - పూరి, రానా ల సందడి, హంగామా అన్ని నెంబర్ 1 యారీలో వచ్చే ఆదివారం బుల్లితెరమీద వీక్షించొచ్చన్నమాట.

ఇకపోతే బాలకృష్ణ తన పైసా వసూల్ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకి కూడా వెళతాడని ప్రచారం జరిగినప్పటికీ ఆ ప్రచారాన్ని పైసా వసూల్ టీమ్ కొట్టిపారేసింది. అయితే బాలకృష్ణ ఇప్పుడు రానా నెంబర్ 1 యారికి వెళ్లి తన సినిమాని పబ్లిసిటీ చేసుకున్నాడు కానీ.. రియాలిటీ షోలో బెస్ట్ షో గా దూసుకుపోతున్న బిగ్ బాస్ షో కి మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే హాజరవ్వలేదనే టాక్ వుంది. ఇక బాలకృష్ణ బిగ్ బాస్ షోకి వెళ్లకపోయినా పైసా వసూల్ డైరెక్టర్ పూరి మాత్రం వెళతాడనే టాక్ వినబడుతుంది. చూద్దాం సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్ధంగా వున్న ఈ పైసా వసూల్ పబ్లిసిటీ ఇంకే రేంజ్ లో ఉండబోతుందో?

Similar News