బాలయ్య సరసన నేనా..నో..నో..

Update: 2017-10-17 08:00 GMT

బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ వుంది. ఇకపొతే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతానికి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో బాలకృష్ణ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ పార్ట్ షూట్ చేశారు. ఈనెల 5న మొదలైన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్.... 15 వరకు జరిగింది. తాజా షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి 60శాతం షూటింగ్ కంప్లీట్ అయింది.

ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా బాలయ్య సరసన నటిస్తున్నారు. అందులో ఒక హీరోయిన్ నటాషా దోషిని ఎంపిక చేసిన చిత్ర బృందం... మూడో హీరోయిన్ గా హరిప్రియను తీసుకుందని అంటున్నారు. అయ్యితే ఈముగ్గురు హీరోయిన్స్ మాత్రమే కాకుండా బాలయ్య సరసన నాలుగో హీరోయిన్ ఉందంటూ వార్తలొచ్చాయి. ఇక ఆ హీరోయిన్ కూడా రెజినా అని.. రెజీనా ని కూడా చిత్రం బృందం ఎంపిక చేసినట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే రెజినా... బాలయ్య సినిమాలో నటిస్తుందని వార్తలను రెజీనా ఖండించింది. తనని బాలయ్య చిత్రంలో నాలుగో హీరోయిన్ గా తీసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను ఆ సినిమాలో నటించడం లేదని స్పష్టం చెయ్యడమే కాదు... చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. ఇక బాలకృష్ణ చిత్రానికి కర్ణ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా... ఈ చిత్రాన్ని సంక్రాతి బరిలో నిలపడానికి బాలయ్యతో పాటే దర్శకుడు రవికుమర్ కూడా కృషి చేస్తున్నారు.

Similar News