బాలయ్య సరసన కొత్త మొహం

Update: 2017-09-04 15:24 GMT

గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు 'పైసా వసూల్' తో వచ్చిన బాలయ్య.. 102 వ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. 'పైసా వసూల్' సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుందనే మాట వినబడుతుంది. 'పైసా వసూల్' విడుదల కాకముందే తన 102 వ చిత్రాన్ని లైన్ లో పెట్టిన బాలకృష్ణ ఏ ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతుంది. ఇప్పటికే బాలకృష్ణ మీద కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను తెరకేకించినట్లు చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అందులో ప్రధానమైన పాత్రకి దక్షిణాదిన లో టాప్ హీరోయిన్ అయిన నయతారని తీసుకోగా... ఇప్పుడు మరో హీరోయిన్ గా మలయాళ నటిని ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి బాలకృష్ణ కి మరో జోడిగా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని ఆలోచించిన చిత్ర బృందం.. అందులో భాగంగానే మలయాళ హీరోయిన్ నటాషా దోషి ని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

నటాషా దోషి ఇప్పటికే మలయాళంలో ‘హైడ్ అండ్ సీక్, నయన, కాల్ మీ @’ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు బాలకృష్ణ తోనే ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇకపోతే ఇప్పటికి ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు మూడో హీరోయిన్ ని కూడా ఎంపిక చెయ్యాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా... ఈ చిత్రాన్ని 2018 సంక్రాతి కి విడుదల చెయ్యాలనే యోచన చేస్తుంది చిత్ర బృందం.

Similar News