బాలయ్య మళ్లీ సింహాని?

Update: 2017-10-23 12:23 GMT

బాలకృష్ణ 'పైసా వసూల్' తరవాత 102 వ చిత్రాన్ని కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సి కళ్యాణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ సన్నివేశాలతోపాటే... చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. అలాగే హరిప్రియ, నటాషా దోషి లు కూడా హీరోయిన్స్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే బాలయ్య - రవికుమర్ సినిమా టైటిల్ విషయంలో కాస్త గందరగోళమే నెలకొని ఉంది.

మొన్న మధ్యన బాలకృష్ణ 102 వ చిత్రానికి 'కర్ణ' అనే టైటిల్ ని ఫిక్స్ చేసేసినట్లుగా వార్తలు రావడం.. ఆ టైటిల్ విషయంలో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరగడంతో.. టైటిల్ విషయమై బాలకృష్ణ వెనక్కి తగ్గాడని ప్రచారము జరిగింది. అయితే ఇప్పుడు బాలయ్య 102 సినిమా టైటిల్ ని 'జై సింహా' గా ఫిక్స్ చేసి ఫైనల్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. బాలయ్య కెరీర్ లో 'సింహ' సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టో తెలిసిందే. ఇప్పుడు అదే 'సింహా' ని ' జై' కి యాడ్ చెయ్యడంతో ఈ సినిమా కూడా అంతే పవర్ ఫుల్ హిట్ అందుకుంటుందని.... భావించి దర్శక నిర్మతలు 'జై సింహ' టైటిల్ కి మొగ్గు చూపారంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Similar News