గత ఆరు నెలలుగా టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయో పిక్ తెరకెక్కుతోందని న్యూస్ హల్చల్ చేస్తూనే ఉంది. ఇక 2018 జనవరి నుండి ఇదిగో అదిగో అంటున్నారే కానీ ఆ సినిమా మొదలయ్యే దాఖలాలు అయితే కనిపించడం లేదు. బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ బయో పిక్ పై పట్టుదలగానే కనిపిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి తో లైమ్ టైమ్ లోకి వచ్చిన డైరెక్టర్ తేజ చెప్పిన ఐడియాలు మెచ్చి ఎన్టీఆర్ బయో పిక్ ని తేజ చేతికి అప్పజెప్పేసాడు బాలయ్య. అలా తేజ చేతికి ఎన్టీఆర్ బయో పిక్ ని ఇచ్చిన బాలయ్య తన వేరే ప్రాజెక్టు లతో బిజీ అయ్యాడు. ఇక తేజ కూడా ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన ప్రస్తుతం తేజ, వెంకీ తో ఆట నాదే వేటా నాదే సినిమాని తెరకెక్కిస్తూ బిజీగా వున్నాడు.
మరి ఎన్టీఆర్ బయో పిక్ పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ.. మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగిన తరుణంలో ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ కి తేజ డైరెక్షన్ అంటే అనుమానాలు రేకెత్తుతున్నాయట. తేజ విషయంలో అసంతృప్తిగా ఉన్న బాలయ్య బాబు ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో ఒక సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినబడుతుంది. అదేమిటంటే ప్రస్తుతం బయో పిక్ నిర్మాణ బాధ్యతలతో పాటుగా హీరోగా తానె ఈ సినిమాలో నటిస్తున్న బాలయ్య ఇప్పుడు ఎన్టీఆర్ బయో పిక్ దర్శకత్వ బాధ్యతలను కూడా మోయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో తేజ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతోనే బాలయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా టాక్. మరి బాలయ్య ఎలా అనుకున్నాడో అలాగే ఎన్టీఆర్ బయో పిక్ ని మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఎన్నికల లోపు ఈసినిమాని విడుదల చెయ్యాలని కృతనిశ్చయంతో ఉన్నాడట. చూద్దాం ఈ బయో పిక్ విషయంలో ఇంకెన్ని వార్తలు బయటికి వస్తాయో.