నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం గత శుక్రవామే విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆటకే మిశ్రమ స్పందన తెచ్చుకోవడం... రెండో ఆటకే ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. 'పైసా వసూల్' లో బాలకృష్ణ గెటప్ తప్ప మరేమి గొప్పగా లేవని.... అసలు సినిమాని పూరి ఏ బేస్ మీద తెరకెక్కించాడని... కథ లేకుండా సినిమా ఎలా ఆడుతుందని... అబ్బో ఒకటేమిటి చాలానే అన్నారు. కేవలం విడుదలరోజు మాత్రమే 'పైసా వసూల్' సత్తా చాటింది. కానీ రెండో రోజు నుండే ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు పడిపోయాయి.
'పైసా వసూల్' తో నిర్మాతలు సేఫ్ అయినప్పటికీ బయ్యర్లు రోడ్డున పడే పరిస్థితి వచ్చేటట్టు ఉందని... రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలొస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదలై ఒక వారం పూర్తయింది. మొదటి వారంలో 'పైసా వసూల్' 17 .77 కోట్ల డిస్ట్రిబ్యూషన్ మాత్రమే వసూలు చేసింది. ఇక ఏరియాల వారీగా పైసా వసూల్ కలెక్షన్స్ మీకోసం.
ఏరియా మొదటివారం షేర్ (కోట్లలో)
నిజాం 3.80
సీడెడ్ 4.01
నెల్లూరు 0.69
కృష్ణ 1.09
గుంటూరు 2.06
వైజాగ్ 1.58
తూర్పు గోదావరి 1.20
పశ్చిమ గోదావరి 0.94
మొదటివారం ఏపీ మరియు టీఎస్ షేర్ 15.37
కర్ణాటక 1.40
రోయ్ & రో 0.55
యుఎస్ఏ 0.45
మొదటివారం వరల్డ్ వైడ్ షేర్ 17.77